Sunday Rasi Phalalu September 6 2026: మేష రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీకు అనేక రకాల శుభవార్తలు అందుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు అత్యంత అనుకూలమైన సమాచారం లభిస్తుంది. రాజకీయ పరిచయాలు ఉపకరిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలలో పాల్గొంటారు, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు. నేడు మీరు చేయవలసిన పూజ.. ‘ఓం శ్రీనివాసాయ నమః’ అనే నామాన్ని నిరంతరం జపించడం శ్రేయస్కరం. వృషభ రాశి వారికి రోజంతా అన్ని విధాలా అనుకూలమైన సమయం నడుస్తుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. పాండురంగ అష్టక పారాయణం చేయడం శుభకరం.
కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అయితే కుటుంబ ఖర్చుల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆలోచించి అడుగులు వేయడం మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభఫలితాలు లభిస్తాయి. సింహ రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. స్నేహితులు, బంధువుల నుండి పూర్తి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ ఆలయాలు, ఆశ్రమాలను దర్శిస్తారు. లక్ష్మీ గణపతి స్వామికి విశేష అర్చన నిర్వహించడం శ్రేయస్కరం. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దిన ఫలాలు అందించారు.

