మనదేశంలోని ప్రజలకు దేవుడిపై నమ్మకం ఎక్కువ.. అందుకే దేవాలయాలను ఎక్కువగా సందర్శిస్తారు.. ఒక్కోదేవాలయంలో ఒక్కో విధమైన ఆచార వ్యవహారాలను కలిగి ఉంటాయి.. ఇక నవ రాత్రుల్లో అయితే అస్సలు చెప్పనక్కర్లేదు.. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చెయ్యడంతో పాటు ప్రత్యేక ప్రసాదాలను కూడా ఇస్తారు.. ఎక్కడైనా ప్రసాదం అంటే పులిహోర, దద్దోజనం లేదా స్వీట్స్ ఉంటాయి.. కానీ ఎక్కడైనా మధ్యాన్ని ప్రసాదంగా ఇవ్వడం చూశారా? కనీసం విన్నారా?.. కానీ మీ ఆలోచన తప్పు అలాంటి దేవాలయం కూడా ఒకటి ఉంది.. మద్యాన్ని ప్రసాదంగా ఎందుకు ఇస్తారో.. దాని వెనుక ఉన్న రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అశ్వయుజ మాసంలో అమ్మవారినవరాత్రులు దేశమంతాట వైభవంగా జరుగుతాయి. ఇదిలా ఉండగా.. ఈసమయంలో ప్రజలు, మద్యం, మాంసాంలను అస్సలు ముట్టుకోరు. ఇలాంటి సందర్భంలో ఉజ్జయినిలో ఒక ప్రసిద్ధ ఆలయం ఉంది. అక్కడ అమ్మవారికి మద్యంనైవేద్యంగా సమర్పిస్తారని చరిత్ర చెబుతుంది.. అంతేకాదు ఇక్కడ మాతృ దేవతకు మద్యాన్ని సమర్పిస్తారు. అంతే కాదు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు మద్యాన్ని ప్రసాదంగా కూడా పంపిణీ చేస్తారు. ఈ ఆలయంలో అమ్మవారికి ఏడాదికి రెండుసార్లు మాత్రమే మద్యం సమర్పిస్తారని సమాచారం..
ఈ ఆలయం చాలా ప్రత్యేకమైన దానితో పాటుగా చాలా చరిత్రను కలిగి ఉంది.. ఇక్కడ ఆలయం లోపల 24 నల్ల రాతి స్తంభాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రదేశాన్ని 24 ఖంభ మాత ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది ఉజ్జయిని నగరంలోకి ప్రవేశించడానికి పురాతన ద్వారం. పూర్వం దాని చుట్టూ గోడ ఉండేది. భైరవుడు, దేవి నగరాన్ని విపత్తుల నుండి రక్షించే తంత్ర సాధనకు ప్రసిద్ధి చెందినదిగా చరిత్ర చెబుతుంది.. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల నాటిదని సమాచారం.. జీవితంలో ఆ ఆలయాన్ని సందర్శించాలని పండితులు చెబుతున్నారు..