Monday Astrology November 2 2026: నేడు వృషభ రాశి వారికి కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులతో సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబ పరంగా సమస్యలు, ఆర్థిక భారాలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన, దీపార్చన నిర్వహించాలి. మిథున రాశి వారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వ్యాపార లావాదేవీలను జాగ్రత్తగా సమీక్షించుకోవాలి. కోపంతో చేసే పనులు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్లాలి. పరమేశ్వరుని పూజించి నందీశ్వరునికి అర్చన చేయాలి.
జీవితంలో ప్రతీరోజూ ఒక కొత్త ఆశతో, భిన్నమైన అనుభవాలతో ముందుకు సాగుతుంది. రాబోయే కాలంలో మనకు ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి, ఏ పనులు చేపడితే విజయం వరిస్తుంది, ఏ దైవారాధన చేస్తే కష్టాలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకోవడం ద్వారా మనం మరింత ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు సోమవారం (2026 నవంబర్ 2) నాటి ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన పరిహారాల సమగ్ర సమాచారంను భక్తి టీవీ ద్వారా మనకు అందించారు. కింది వీడియోలో 12 రాశుల వారి నేటి రాశి ఫలాలు ఉన్నాయి.

