మన భారతీయులు ఎక్కువగా జరుపుకొనే పండుగలలో మహా శివరాత్రి పండుగ కూడా ఒకటి .. శివుడికి ఎంత ప్రీతికరమైన రోజు.. మహాశివరాత్రి పండుగను హిందూ చాంద్రమాన మాసం ఫాల్గుణ మాసంలో 14వ రోజు వస్తుంది.. ఈ ఏడాది మార్చి 8న శివరాత్రి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు.. ఈరోజున అందరు ఉపవాసాలు చేస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు.. అసలు శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారో.. ఉపవాసం చేస్తున్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శివరాత్రి రోజున ఉదయం లేచి స్నానాలు చేసి శివ పూజకు సిద్ధం చేసుకోవాలి.. ఉదయం ఉపవాసం చేయడం వల్ల ఎంతో పవిత్రత వస్తుందని చెబుతున్నారు.అందుకే హిందువులంతా ఆ రోజు ఉపవాసం ఉండి జాగారం ఉంటారు. ఆ ఒక్క రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే సంవత్సరం అంతా శివుడిని ఆరాధించిన పుణ్యం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు.. అలా చెయ్యడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుందని ప్రజలు భావిస్తారు.
ఉపవాసం ఉండేవారు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. అవేంటంటే.. ఉపవాసం ఉండేవారు కొందరు అసలు నీళ్లు కూడా తాగకుండా ఉంటారు. ఆలా చెయ్యడం వల్ల శరీరం శుభ్రం అవుతుందని భావిస్తారు. అయితే మరికొందరు పండ్లు , పాలు , టిఫిన్స్ చేస్తారు.. వాటికి బదులు ఇలాంటివి తీసుకుంటే మంచిదట.. సగ్గుబియ్యం, మినుములు, గుమ్మడికాయ, బంగాళదుంపలు, ఫుల్ మఖాన, అరటిపండు, పెరుగు వంటివి తీసుకోవచ్చు.. గోధుమలు, బియ్యం, కూరగాయలు, పప్పులు వంటి ఆహారాలకు మాత్రం దూరంగా ఉండాలి.. ఇక శివయ్యకు బియ్యం , పాలతో చేసిన తీపి వంటకాలను సమర్పిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు..