Koti Deepotsavam: ఐదోరోజు అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్‌రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భక్తి టీవీ కోటి దీపోత్సవం ఐదో రోజు అంగరంగ వైభవంగా సాగింది. అక్టోబర్ 31న ప్రారంభమైన ఈ మహాక్రతువు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఐదో రోజు కోటిదీపోత్సవం కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హరీష్‌రావు దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోటి దీపోత్సవంలో భాగంగా ముందుగా శ్రీ స్మరణానంద గిరి స్వామీజీ ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం జరిగింది. అనంతర బ్రహ్మశ్రీ డా.మైలవరపు శ్రీనివాసరావు గారిచే ప్రవచనామృతం జరిగింది. శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే జరిపించారు.

Also Read
- Thursday Astrology Predictions: గురువారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల్లో లాభాలే లాభాలు!
- ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి సమస్యలు, ఆటంకాలు తప్పవు1
- Monday Horoscope: ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు.! నేటి రాశిఫలాలు ఇలా..
ఆ తర్వాత విజయవాడ శ్రీ కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన వేదిక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణం, సింహ వాహన సేవ కన్నుల పండువగా సాగాయి. చివరగా సకల శుభాలను కలిగించే సప్త హారతి, భక్తులను మైమరిపించేలా లింగోద్భవం జరిగాయి.

కాగా ప్రతీ ఏటా కార్తిక మాసంలో ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నారు.. కోటి దీపోత్సవానికి అవసరమైన అన్ని పూజా సామాగ్రి, పూలు భక్తులకు ఉచితంగా అందిస్తోంది. కార్తిక మాసం శుభవేళ బంగారు లింగోద్భవ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాలు ఓం నమఃశివాయా నామ స్మరణతో మార్మోగిపోతున్నాయి.. విశేషమైన భక్తుల మధ్య.. అన్ని కార్యక్రమాలు ఆద్యంతం కోటిదీపోత్సవం ఐదో రోజు కన్నుల పండుగగా సాగాయి.
కోటిదీపోత్సవం-2022 5వ రోజు కార్తికదీపారాధన #BhakthiTV #Kotideepotsavam2022 #NtvTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam pic.twitter.com/A7UxY6kicg
— BhakthiTV (@BhakthiTVorg) November 4, 2022
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!