Koti Deepotsavam 2025 Day 6: హైదరాబాద్లో భక్తి తరంగాలు ఉప్పొంగుతున్నాయి. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 మహోత్సవం ఐదవ రోజు భక్తి వాతావరణంలో సాగింది. వేలాది మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియంలో దీపాలు వెలిగిస్తూ “ఓం నమః శివాయ” నినాదాలతో భక్తి కాంతులతో వెలుగులు నింపారు. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమై, 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం పొందిన ఈ మహోత్సవం, ప్రతి ఏడాది భక్తులకు కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. కార్తీకమాస భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ దీపాల మహోత్సవం, “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రపంచానికి చాటుతోంది. ఆరవ రోజు కోటి దీపోత్సవంలో విశేష పూజలు ఉండనున్నాయి.
READ MORE: Allu Aravind : నిర్మాతగా కోట్లు సంపాదించాను.. కానీ ఈ సినిమా తృప్తిని ఇచ్చింది – అల్లు అరివింద్
ఆరవ రోజు విశేష కార్యక్రమాలు 6-11-2025 (కార్తిక గురువారం)
పూజశ్రీ విశ్వప్రసన్నతీర్థ మహాస్వామీజీ (పెజావర్ మఠం, ఉడుపి), పూజ్యశ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామీజీ (కాశీ జగద్గురు) ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం ఉంటుంది. బ్రహ్మశ్రీ నోరి నారాయణ మూర్తి ప్రవచనామృతం నిర్వహిస్తారు. వేదికపై కొండగట్టు ఆంజనేయస్వామికి కోటి తమలపాకుల అర్చన, భద్రాచలం శ్రీరామ మహాపూజ జరుపుతారు. భక్తులచే ఆంజనేయ విగ్రహాలకు కోటి తమలపాకుల అర్చన నిర్వహిస్తారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, హనుమంత వాహన సేవతో ముగుస్తుంది.