కార్తీక మాసం అంటే శివుడుకు చాలా ఇష్టం.. ఆయనను భక్తితో పూజలు చేస్తారు.. అంతేకాదు హిందువులు అందరు కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి అనే ఆచారాన్ని పాటిస్తున్నారు. కార్తీకమాసంలో మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు.. ఉసిరి దీపాలు పెట్టడం దగ్గరి నుంచి ఉసిరి చెట్టుకు పూజలు కూడా చేస్తారు.. అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఔషధాల గని ఉసిరి. వృద్దాప్య ఛాయలు తగ్గించే గుణాలు ఉసిరిలో ఉన్నాయి. ఉసిరి చెట్టును ధాత్రీ వృక్షం అని, ఆరోగ్య సంజీవని అని అంటారు. ఉసిరి చెట్టు గాలి మన ఆరోగ్యానికి మంచిది.. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కి పూజ చేసి ఈ చెట్టు కింద భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని చెబుతారు. ఉసిరి చెట్టు మూలంలో విష్ణు మూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మ దేవుడు ఇంకా ఉసిరి చెట్టు ఆకులలో సకల దేవతలు ఉంటారని భక్తులు నమ్ముతారు.. అందుకే చెట్టుకు నాలుగు దిక్కులు దీపాలను పెడుతారు..
ఉసిరి చెట్టును ఇంట్లో పెంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. దోషాలు తొలగిపోతాయి అని, నరదిష్ఠి తొలగిపోతుందని కొందరి నమ్మకం. ఉసిరికాయలను రోజుకొకటి చొప్పున సంవత్సరం మొత్తం తింటే మనకు ఎటువంటి వ్యాధులు రావని డాక్టర్లు కూడా చెబుతున్నారు.. ఇక ఉసిరి కాయలను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.. కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద భోజనం, ఉసిరి పచ్చడి తినడం చేస్తే ఆరోగ్యం, పుణ్యం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు..