Horoscope November 1 2026: నవంబర్ నెల ప్రారంభ రోజున మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఏ పనులు చేపడితే అనుకూల ఫలితాలు వస్తాయి, ఏ దైవారాధనతో ఇబ్బందులు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 2026 నవంబర్ 01 నాటి ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన పరిహారాల సమగ్ర సమాచారంను భక్తి టీవీ వేదికగా అందించారు. ఆ డీటెయిల్స్ కింది వీడియోలో ఉన్నాయి.
కుంభ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆకస్మిక ధనలాభాలు కలగడంతో పాటు తలపెట్టిన పనులలో విజయాలు సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. శ్రీ మహావిష్ణువుకు తులసి దలాలు సమర్పించాలి. మిథున రాశి వారు అన్ని కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. ధార్మిక చింతన పెరిగి, శుభకార్యాల విషయంలో అనుకూలతలు ఏర్పడతాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. డబ్బు రాక ఉంటుంది. మహాగణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి.

