Holi 2026: హోలీ 2026పై గందరగోళం.. రంగుల పండుగపై చంద్రగ్రహణం ప్రభావం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holi 2026: హోలీ 2026 తేదీపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. దీనికి ప్రధాన కారణం మార్చి 3, 2026న సంభవించనున్న చంద్రగ్రహణం.. కామ దహనం.. హోలీ తేదీల విషయంలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో, జ్యోతిష శాస్త్రం మరియు పంచాంగాల ఆధారంగా ఖచ్చితమైన వివరాలు వెల్లడిస్తున్నారు పండితులు..
కామ దహనం ఎప్పుడు?
భారతీయ జ్యోతిషశాస్త్రం, నిర్ణయ్ సింధు గ్రంథం ఆధారంగా జ్యోతిష్కుడు పండిట్ దైవజ్ఞ కృష్ణ శాస్త్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ఫాల్గుణ మాసం శుక్ల పక్ష చతుర్దశి తేదీ మార్చి 2, 2026న వస్తుంది. శాస్త్రాల ప్రకారం, భద్ర కాలంలో కామ దహనం చేయకూడదు. తోక కాలంలో చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే, కామ దహనానికి శుభ సమయంగా మార్చి 2 అర్ధరాత్రి 12:50 గంటల నుంచి 2:02 గంటల వరకు అని పేర్కొంటున్నారు..
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
చంద్రగ్రహణం ఎప్పుడు?
మార్చి 3, 2026న ఫాల్గుణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం సంభవిస్తుంది… గ్రహణ ప్రారంభ సమయం మధ్యాహ్నం 3:20 కాగా.. గ్రహణ మధ్య సమయం సాయంత్రం 5:04.. గ్రహణ ముగింపు సమయం సాయంత్రం 6:47గా చెబుతున్నారు.. ఈ రోజు చంద్రోదయం సాయంత్రం 5:59కు ఉంటుంది.. భారతదేశంలో చంద్రోదయం తర్వాత మాత్రమే గ్రహణం కనిపిస్తుంది. అంటే, గ్రహణం ముగింపు దశ మాత్రమే దర్శనమిస్తుందన్నమాట.. పండితుల ప్రకారం.. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. అందువల్ల, మార్చి 3 ఉదయం 6:20 గంటల నుంచి సూతక కాలం ప్రారంభమవుతుందన్నమాట..
హోలీ ఎప్పుడు జరుపుకోవాలి?
చంద్రగ్రహణం మరియు సూతక కాలం కారణంగా మార్చి 3న రంగుల పండుగ నిర్వహించడం శాస్త్రపరంగా సముచితం కాదని పండితులు చెబుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా మార్చి 4, 2026 (చైత్ర కృష్ణ పక్ష ప్రతిపద) న హోలీ జరుపుకోవాలని నిర్ణయించారు. పండిట్ వేద ప్రకాష్ మిశ్రా ప్రకారం, సంప్రదాయంగా హోలికా దహనం రాత్రిపూట, మరుసటి రోజు రంగుల పండుగ జరుపుతారు. కానీ మార్చి 3న చంద్రగ్రహణం ఉండటంతో, ఆ రోజున హోలీ ఆడటం శుభకరం కాదు. అందువల్ల మార్చి 4న హోలీ జరుపుకోవడమే సరైనది అని తెలిపారు.
ఈ చంద్రగ్రహణం భారతదేశం, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం, అమెరికా ఖండాలలో కనిపించనుంది. మొత్తంగా.. కామ దహనాన్ని మార్చి 2, 2026 (అర్ధరాత్రి 12:50 – 2:02) వరకు నిర్వహించుకోవచ్చు అని.. చంద్రగ్రహణం: మార్చి 3, 2026న ఉండడంతో.. హోలీ (రంగుల పండుగ): మార్చి 4, 2026న జరుపుకోవాలని.. చంద్రగ్రహణ ప్రభావం కారణంగా హోలీ తేదీలో మార్పు రావడంతో, ఈ ఏడాది రంగుల పండుగ ఒక రోజు ఆలస్యంగా జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!