Diwali Horoscope 2026: దీపావళి రోజు దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!

Diwali Horoscope 2026

Diwali Horoscope 2026

Sunday Horoscope November 8 2026: దీపావళి పర్వదినాన వెలుగుల పండగ సందర్భంగా అందరి జీవితాల్లోనూ ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటూ.. ఈ పవిత్ర రోజున మన రాశిఫలాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ దేవతను ఆరాధిస్తే సిరిసంపదలు చేకూరుతాయి అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఆదివారం (2026 నవంబర్ 8) నాటి ద్వాదశ రాశుల దీపావళి ఫలాలు, పాటించాల్సిన పరిహారాల సమగ్ర సమాచారంను భక్తి టీవీ వేదికగా అందించారు.

కుంభ రాశి వారు ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిసి, ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా సమీక్షలు జరుగుతుంటాయి. శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని పూజించి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేయాలి. మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. రాజకీయ, క్రీడా రంగాల వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. శుభవార్తలు విని, వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారిని స్మరించి లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. కర్కాటక రాశి వారికి కుటుంబ పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉంటాయి. సుఖసంతోషాలతో కూడిన జీవనం ఉండి, ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. పెద్దలతో కలిసి కుటుంబ వేడుకలలో పాల్గొంటారు. శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి గులాబీ పుష్పాలతో అర్చన చేయాలి.