Lakshmi Puja Timings 2025: ప్రతి ఏడాది కార్తీక అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది దీపావళి పండుగ చాలా ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్కులు అంటున్నారు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత, దీపావళి నాడు మహాలక్ష్మీ రాజ్యయోగం ఏర్పడబోతోందని పేర్కొన్నారు. దీపావళి పండుగ రోజు రాత్రి లక్ష్మీదేవి భూమిని సందర్శించి తన భక్తులకు సంపద, శ్రేయస్సులను అందజేస్తుందని చెబుతారు.
ఈ సందర్భంగా పలువురు జ్యోతిష్యులు మాట్లాడుతూ.. దాదాపు 100 ఏళ్ల తర్వాత దీపావళి రోజున మహాలక్ష్మీ రాజ్యయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వాస్తవానికి 2025 సంవత్సరం ప్రజలకు గందరగోళంతో ఉందని అంటున్నారు. యుద్ధం, ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్ పతనాల తర్వాత, దీపావళి రోజున మహాలక్ష్మీ రాజ్యయోగం ఏర్పడటం ఒక శుభ సంకేతానికి సంకేతం లాంటిదని వెల్లడిస్తున్నారు. మహాలక్ష్మీ రాజయోగం కారణంగా, సాధారణ ప్రజలు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని అంటున్నారు.
ఈ దీపావళి పండుగ రోజున చంద్రుడు, కుజుడుల సంయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. బుధుడు, శుక్రుడు వారి రాశిచక్రాలలోకి ప్రవేశించడం కూడా విప్రీత రాజ్యయోగాన్ని సృష్టిస్తోందని పేర్కొన్నారు. రెండవది అక్టోబర్ 19న బృహస్పతి తన ఉచ్ఛమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుందని, ఇది ఈ దీపావళిని నిజంగా శుభప్రదంగా మారుస్తోందని అభిప్రాయపడుతున్నారు.
లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం ఏంటి?
ఈ దీపావళికి లక్ష్మీమాత పూజకు మూడు ప్రత్యేక శుభ సమయాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీకు అనుకూలమైన ఏ సమయంలోనైనా మీరు లక్ష్మీ దేవిని పూజించవచ్చని వాళ్లు పేర్కొన్నారు.
మొదటి శుభ సమయం (ప్రదోష కాలం) – సాయంత్రం 05:46 నుంచి రాత్రి 08:18 వరకు.
రెండవ శుభ సమయం (వృషభ కాలం) – సాయంత్రం 7:08 నుంచి 9:03 వరకు
మూడవ శుభ సమయం (అత్యున్నత శుభ సమయం) – సాయంత్రం 7:08 నుంచి 8:18 వరకు. ఈ సమయంలో మీరు లక్ష్మీమాతను, వినాయకుడిని పూజించడానికి దాదాపు 1 గంట 11 నిమిషాల సమయం ఉంటుందని చెబుతున్నారు.
ఈ సంవత్సరం కార్తీక అమావాస్య రెండు రోజులు వస్తుంది. కార్తీక అమావాస్య అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:44 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 21న సాయంత్రం 5:54 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ప్రదోష కాలం, నిషిత్ కాలం కారణంగా అక్టోబర్ 20న అంటే సోమవారం దీపావళి పండుగను జరుపుకోవడం సముచితం అని పేర్కొన్నారు.
READ ALSO: Pakistan HS-1 Satellite: డ్రాగన్ నేల పైనుంచి దాయాది గూఢచారి ఉపగ్రహ ప్రయోగం!