Karthika Somavaaram: ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామంతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తులు గోదావరి, కృష్ణా నదుల్లో పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వదిలారు. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలతో పాటు ప్రముఖ ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి తదితర ఆలయాల్లో కార్తీక సోమవారం రద్దీ కొనసాగుతోంది. భక్తులు నదిలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.
Read also: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పాముల కలకలం..
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శివాలయం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. పాతాళగంగలో భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక స్నానాలు చేస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు స్వామివారి స్పర్శ దర్శనాన్ని రద్దు చేశారు. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తున్నారు. ద్రాక్షారామం, కుమారారామం, క్షీరారామం, భీమారామం, అమరారామం వంటి పంచారామ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. త్రిపురాంతకం, భైరవకోన, శ్రీకాళహస్తి, కపిలతీర్థం తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివ నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..