Hyderabad Bonalu: మనిషికి ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది. పంచభూతాలతో రూపొందించబడిన ఈ శరీరాన్ని మానవాతీత శక్తి నడిపిస్తుందని నమ్ముతారు. అందుకే జననం, జీవితం, మరణం అన్నీ చిత్రవిచిత్రాలే. వాటి వెనుక ఎన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నా అంతుచిక్కని సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారిని పూజించే రోజు బోనాలు. జూలై 6న ఆషాడమాసం ప్రారంభం కానుంది. జూలై 7వ తేదీ ఆదివారం నుంచి బోనాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగలో ఆధ్యాత్మిక కారణాలకు మించిన ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. కొత్త కుండలో సగానికి సున్నం, పైభాగానికి నూనె రాసి, పసుపు, కుంకుమలు పూసి, చందనం పూస్తారు. ఘటాన్ని అన్నంతో నింపి, దాని చుట్టూ మామిడి, వేప ఆకులతో దండలు వేస్తారు. ఘటంపై దీపం వెలిగించడానికి మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించి చుట్టుపక్కల అందరితో కలిసి వెళ్లి బోనం సమర్పిస్తారు.
Read also: B.Krishna Mohan: బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే..?
ఆషాడం అంటే వర్షాకాలం ప్రారంభం… చిన్న చిన్న గుంతలు కూడా నీటితో నిండిపోతాయి. దీంతో తీవ్రమైన జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలే సమయం. అంటు వ్యాధులు వైరస్ల ద్వారా వ్యాపిస్తాయి. వైద్య శాస్త్రం పరిణతి చెందని కాలంలో ప్లేగు, కలరా, మశూచి వంటి మహమ్మారి బారిన పడి పిట్టల్లా చనిపోతున్నారు. దానినే గత్తర వచ్చింది అని చెప్పేవారుఈ విపత్తుల నుండి రక్షించాలని అమ్మవారిని పూజిస్తారు. ఊరు వాడను శుభ్రం చేయడం వల్ల సగం క్రిములు తరిమికొడితే… వేపాకు, పసుపు నీళ్లతో ఇన్ఫెక్షన్లను నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ప్రతి లోగిలి ముందు కల్లాపి చల్లడం, ముగ్గులు వేయండం వేపాకులు, పసుపు రాసుకోవడం వల్ల క్రిములు తొలగిపోతాయి. బోనం పాత్రలో బియ్యం, ఉల్లి, మిరియాలు, పరమానం వేసి మూతపెట్టి నూనె పోసి దీపం వెలిగించాలి. వంశం సుభిక్షంగా ఉండాలని, కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవించాలని సాక పోస్తారు. మశూచి వంటి వ్యాధుల నుంచి కాపాడుతుందంటారు.
Oily Skin Makeup Tips: జిడ్డు చర్మం ఉన్న అమ్మాయిలు ఇలా మేకప్ చేసుకుంటే చర్మం మెరుస్తుంది