Site icon NTV Telugu

Tata Sierra: టాటా సియెర్రా, మరో ‘‘ నెక్సాన్’’ కాబోతోందా..

Tata Sierra

Tata Sierra

Tata Sierra: ఇటీవల ఏళ్లలో ఎక్కువగా ఎదురుచూస్తున్న కార్‌లలో టాటా సియెర్రా (Tata Sierra) ఒకటి. టాటా 1990లో తీసుకువచ్చిన ఈ ఎస్‌యూవీని, ఇప్పుడు సరికొత్తగా తీసుకువస్తోంది. డిజైన్, టెక్నాలజీని మేళవింపు చేసి ఈ ఎస్‌యూవీని టాటా తీసుకువస్తోంది. నవంబర్ 25,2025న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే, ఈ కారును టాటా అన్‌విల్ చేసింది. టాటా ఇతర కార్లతో పోలిస్తే డిజైన్, డ్యాష్ బోర్టు భిన్నంగా ఉంది. టాటా కార్‌లలో తొలిసారిగా సియెర్రాలోనే 3-స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ కారు 5-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ సాధించింది.

అయితే, ఈ కారు టాటాకు మరో ‘‘నెక్సాన్’’(Nexon) అవుతుందని ఆ సంస్థ భావిస్తోంది. టాటా మోటార్స్‌లో నెక్సాన్ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇప్పటికే భారత్ వ్యాప్తంగా ఇష్టపడే కాంపాక్ట్ ఎస్‌యూవీలో నెక్సాన్ టాప్‌లో ఉంది. నెక్సాన్ రాక ముందు టాటా కష్టమైన దశలో ఉండేది. టాటా మోటార్స్‌ని నెక్సాన్ ముందు, నెక్సాన్ తర్వాతగా అభివర్ణించవచ్చు. 2017లో మొదలైన నెక్సాన్ ప్రభంజనం ఇప్పటికీ కొనసాగుతోంది. భారతదేశంలో ఎక్కువగా అమ్ముడైన కాంపాక్ట్ SUVలలో ఒకటిగా మారింది. ఇది అమ్మకాల గురించే కాకుండా, టాటాపై వినియోగదారుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచింది.

Read Also: Varanasi: సూపర్ స్టార్ లుక్స్ అరాచకం అంతే.. మహేష్ బాబు-రాజమౌళి సినిమా పేరు అదే..!

అయితే, ఇప్పుడు సియెర్రా కూడా మరో నెక్సాన్ అవుతుందని టాటా భావిస్తోంది. ఐకానిక్ డిజైన్‌తో సియెర్రా కార్ లవర్స్‌ని ఆకర్షిస్తోంది. 1990లో మూడు డోర్లతో వచ్చిన సియెర్రా, 2025లో 5-డోర్ కాన్ఫిగరేషన్‌తో వస్తోంది. దీంట్లో కొత్తగా 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ ఉండబోతోంది. ఇది దాదాపుగా 115-120hp పవర్, 140-150Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. దీంతో పాటు .5-లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ కూడా ఉండబోతోంది. మరింత పంచీ డ్రైవ్ కోసం పవర్ కోరుకునే వారికి 160-160bhp పవర్, 250-270Nm శక్తిని అందిస్తుంది. ఇప్పటికే హారియర్, సఫారీలో ఉన్న 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్ కూడా ఉండబోతోంది. ఈ ఇంజన్ 168bhp పవర్, 350Nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లు ఉంటాయి.

ఇదే కాకుండా సియెర్రా ఈవీ కూడా రాబోతోంది. ఇది టాటా యొక్క Acti.EV ఆర్కిటెక్చర్ ఆధారం నిర్మితమవుతోంది. హారియర్ ఈవీ కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌పై వచ్చింది. ఇది డ్యుయల్ మోటార్, ఆల్‌‌వీల్ డ్రైవ్ (AWD) కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఒక్క ఫుల్ ఛార్జ్ తో 500 కి.మీ రేంజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Exit mobile version