Tata Sierra: టాటా సియెర్రా, మరో ‘‘ నెక్సాన్’’ కాబోతోందా..
- లాంచ్‌కు సిద్ధమైన టాటా సియెర్రా..
- సియోర్రా టాటాకు మరో నెక్సాన్ అవుతుందా..
- సియోర్రా సక్సెస్‌పై భారీ ఆశలు పెట్టుకున్న సంస్థ..
- ఆకట్టుకుంటున్న డిజైన్, ఫీచర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Sierra: ఇటీవల ఏళ్లలో ఎక్కువగా ఎదురుచూస్తున్న కార్లలో టాటా సియెర్రా (Tata Sierra) ఒకటి. టాటా 1990లో తీసుకువచ్చిన ఈ ఎస్‌యూవీని, ఇప్పుడు సరికొత్తగా తీసుకువస్తోంది. డిజైన్, టెక్నాలజీని మేళవింపు చేసి ఈ ఎస్‌యూవీని టాటా తీసుకువస్తోంది. నవంబర్ 25,2025న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే, ఈ కారును టాటా అన్విల్ చేసింది. టాటా ఇతర కార్లతో పోలిస్తే డిజైన్, డ్యాష్ బోర్టు భిన్నంగా ఉంది. టాటా కార్లలో తొలిసారిగా సియెర్రాలోనే 3-స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ కారు 5-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ సాధించింది.
అయితే, ఈ కారు టాటాకు మరో ‘‘నెక్సాన్’’(Nexon) అవుతుందని ఆ సంస్థ భావిస్తోంది. టాటా మోటార్స్‌లో నెక్సాన్ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇప్పటికే భారత్ వ్యాప్తంగా ఇష్టపడే కాంపాక్ట్ ఎస్‌యూవీలో నెక్సాన్ టాప్‌లో ఉంది. నెక్సాన్ రాక ముందు టాటా కష్టమైన దశలో ఉండేది. టాటా మోటార్స్‌ని నెక్సాన్ ముందు, నెక్సాన్ తర్వాతగా అభివర్ణించవచ్చు. 2017లో మొదలైన నెక్సాన్ ప్రభంజనం ఇప్పటికీ కొనసాగుతోంది. భారతదేశంలో ఎక్కువగా అమ్ముడైన కాంపాక్ట్ SUVలలో ఒకటిగా మారింది. ఇది అమ్మకాల గురించే కాకుండా, టాటాపై వినియోగదారుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచింది.
Also Read
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!

Read Also: Varanasi: సూపర్ స్టార్ లుక్స్ అరాచకం అంతే.. మహేష్ బాబు-రాజమౌళి సినిమా పేరు అదే..!
అయితే, ఇప్పుడు సియెర్రా కూడా మరో నెక్సాన్ అవుతుందని టాటా భావిస్తోంది. ఐకానిక్ డిజైన్‌తో సియెర్రా కార్ లవర్స్‌ని ఆకర్షిస్తోంది. 1990లో మూడు డోర్లతో వచ్చిన సియెర్రా, 2025లో 5-డోర్ కాన్ఫిగరేషన్‌తో వస్తోంది. దీంట్లో కొత్తగా 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండబోతోంది. ఇది దాదాపుగా 115-120hp పవర్, 140-150Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. దీంతో పాటు .5-లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఉండబోతోంది. మరింత పంచీ డ్రైవ్ కోసం పవర్ కోరుకునే వారికి 160-160bhp పవర్, 250-270Nm శక్తిని అందిస్తుంది. ఇప్పటికే హారియర్, సఫారీలో ఉన్న 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉండబోతోంది. ఈ ఇంజన్ 168bhp పవర్, 350Nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు ఉంటాయి.
ఇదే కాకుండా సియెర్రా ఈవీ కూడా రాబోతోంది. ఇది టాటా యొక్క Acti.EV ఆర్కిటెక్చర్ ఆధారం నిర్మితమవుతోంది. హారియర్ ఈవీ కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌పై వచ్చింది. ఇది డ్యుయల్ మోటార్, ఆల్‌వీల్ డ్రైవ్ (AWD) కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఒక్క ఫుల్ ఛార్జ్ తో 500 కి.మీ రేంజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!