Site icon NTV Telugu

జీఎస్‌టీ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన Toyota కార్ల ధరలు.. ఏకంగా రూ.3.49 లక్షల తగ్గింపు!

Toyota

Toyota

Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన కార్లపై జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22, 2025 నుండి ఐసీఈ (ICE) పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా సేల్స్, సర్వీస్, యూజ్డ్ కార్ బిజినెస్, ప్రాఫిట్ ఎన్‌హాన్స్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక సంస్కరణకు భారత ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇది కస్టమర్లకు కార్లను మరింత అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, ఆటోమొబైల్ రంగంపై నమ్మకాన్ని పెంచింది. పండుగ సీజన్‌కు ముందు ఈ తగ్గింపు ధరలు కార్ల డిమాండ్‌ను పెంచుతుందని మేము ఆశిస్తున్నామని తెలిపారు.

Asia Cup 2025: శాంసన్‌‌, సింగ్‌కు షాక్.. ఆసియా కప్‌లో భారత తుది జట్టు ఇదే!

పారదర్శకతతో, కస్టమర్ బేస్ సంస్థగా ఈ ప్రయోజనాలను మా కస్టమర్లకు బదిలీ చేయడం మాకు సంతోషంగా ఉందని.. ప్రపంచ స్థాయి మొబిలిటీ సొల్యూషన్స్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. డిమాండ్‌ను పెంచే, అందరికీ మొబిలిటీని అందుబాటులోకి తెచ్చే, ఆనందాన్ని పెంపొందించే ఇలాంటి సంస్కరణలను మేము స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ చర్య భారతదేశ స్థిరమైన, వృద్ధికి దోహదం చేస్తుందని వాధ్వా అన్నారు.

Nuzvid : నూజివీడు IIIT కాలేజీలో ల్యాబ్ ఎగ్జామ్ రాయనివ్వలేదని ప్రొఫెసర్‌పై కత్తితో దాడి

వివిధ టయోటా మోడళ్లపై జీఎస్‌టీ రేట్ల తగ్గింపు కారణంగా ధరలు తగ్గాయి. ఇందులో భాగంగా గ్లాంజా మోడల్‌పై రూ. 85,300, టాయ్‌సర్ పై రూ. 1,11,100, రూమియన్ పై రూ. 48,700 వరకు ధరలు తగ్గాయి. అదేవిధంగా, హైరైడర్ మోడల్‌పై రూ. 65,400, క్రిస్టాపై రూ. 1,80,600, హైక్రాస్ పై రూ. 1,15,800 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ప్రీమియం మోడళ్లలో, ఫార్చ్యూనర్‌పై గరిష్టంగా రూ. 3,49,000, లెజెండర్‌పై రూ. 3,34,000, హిలక్స్‌పై రూ. 2,52,700 వరకు ధరలు తగ్గుతాయి. అలాగే, క్యామ్రీపై రూ. 1,01,800, వెల్‌ఫైర్‌పై రూ. 2,78,000 వరకు తగ్గింపు వర్తిస్తుంది.

Exit mobile version