జీఎస్టీ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన Toyota కార్ల ధరలు.. ఏకంగా రూ.3.49 లక్షల తగ్గింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన కార్లపై జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22, 2025 నుండి ఐసీఈ (ICE) పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా సేల్స్, సర్వీస్, యూజ్డ్ కార్ బిజినెస్, ప్రాఫిట్ ఎన్హాన్స్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక సంస్కరణకు భారత ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇది కస్టమర్లకు కార్లను మరింత అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, ఆటోమొబైల్ రంగంపై నమ్మకాన్ని పెంచింది. పండుగ సీజన్‌కు ముందు ఈ తగ్గింపు ధరలు కార్ల డిమాండ్‌ను పెంచుతుందని మేము ఆశిస్తున్నామని తెలిపారు.
Asia Cup 2025: శాంసన్, సింగ్‌కు షాక్.. ఆసియా కప్‌లో భారత తుది జట్టు ఇదే!
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
- Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
పారదర్శకతతో, కస్టమర్ బేస్ సంస్థగా ఈ ప్రయోజనాలను మా కస్టమర్లకు బదిలీ చేయడం మాకు సంతోషంగా ఉందని.. ప్రపంచ స్థాయి మొబిలిటీ సొల్యూషన్స్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. డిమాండ్‌ను పెంచే, అందరికీ మొబిలిటీని అందుబాటులోకి తెచ్చే, ఆనందాన్ని పెంపొందించే ఇలాంటి సంస్కరణలను మేము స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ చర్య భారతదేశ స్థిరమైన, వృద్ధికి దోహదం చేస్తుందని వాధ్వా అన్నారు.
Nuzvid : నూజివీడు IIIT కాలేజీలో ల్యాబ్ ఎగ్జామ్ రాయనివ్వలేదని ప్రొఫెసర్‌పై కత్తితో దాడి
వివిధ టయోటా మోడళ్లపై జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా ధరలు తగ్గాయి. ఇందులో భాగంగా గ్లాంజా మోడల్‌పై రూ. 85,300, టాయ్సర్ పై రూ. 1,11,100, రూమియన్ పై రూ. 48,700 వరకు ధరలు తగ్గాయి. అదేవిధంగా, హైరైడర్ మోడల్‌పై రూ. 65,400, క్రిస్టాపై రూ. 1,80,600, హైక్రాస్ పై రూ. 1,15,800 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ప్రీమియం మోడళ్లలో, ఫార్చ్యూనర్పై గరిష్టంగా రూ. 3,49,000, లెజెండర్‌పై రూ. 3,34,000, హిలక్స్పై రూ. 2,52,700 వరకు ధరలు తగ్గుతాయి. అలాగే, క్యామ్రీపై రూ. 1,01,800, వెల్‌ఫైర్‌పై రూ. 2,78,000 వరకు తగ్గింపు వర్తిస్తుంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!