Site icon NTV Telugu

Top Selling Cars: భారీగా SUVల అమ్మకాలు.. టాప్ 10 బెస్ట్‌సెల్లింగ్ కార్ల లిస్ట్ ఇదిగో..!

Top Selling Cars

Top Selling Cars

Top Selling Cars: భారత దేశ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ లో ప్రస్తుతం అమ్మకాల జోరు కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా SUV సెగ్మెంట్ మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఈ టాప్ 10 కార్ల జాబితాలో ఒక్క సెడాన్ మాత్రమే ఉండటం గమనార్హం. టాటా నెక్సాన్ అక్టోబర్ 2025లో 22,083 యూనిట్ల అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇక ఈ లిస్టులో మారుతీ సుజుకి డిజైర్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సెడాన్. రెండో స్థానంలో నిలిచిన ఈ కారు 20,791 యూనిట్ల అమ్మకాలతో 64% వార్షిక వృద్ధిని సాధించింది. సెడాన్ సెగ్మెంట్ ప్రభావం తగ్గుతున్న సమయంలో కూడా డిజైర్ ఇంత పెద్ద సంఖ్యలో అమ్ముడవడం నిజంగా ఆశ్చర్యమే.

Mahesh Chandra Laddha: ఏపీలో 50 మంది మావోయిస్టులు అరెస్ట్.. కీలక విషయాలు వెల్లడించిన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌

ఇక మూడోస్థానంలో మారుతీ సుజుకి ఎర్టిగా 20,087 యూనిట్ల అమ్మకాలతో నిలవగా, నాల్గోస్థానంలో 18,970 యూనిట్లతో వాగనార్ స్థిరమైన ప్రజాదరణను కొనసాగించింది. గత ఏడాదితో పోలిస్తే వాగనార్ 36% వృద్ధిని నమోదు చేసింది. ఇక హ్యుందాయ్ క్రెటా 18,381 యూనిట్లతో ఐదో స్థానం దక్కించుకోగా.. ఈ జాబితాలో మహీంద్రా స్కార్పియో 17,880 యూనిట్లు, మారుతీ ఫ్రాంక్స్ 17,003 యూనిట్లు, బాలెనో 16,873 యూనిట్ల అమ్మకాలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చివరిగా తొమ్మిదో స్థానంలో టాటా పంచ్ 16,810 యూనిట్లతో మంచి పరుగును కొనసాగించగా, మారుతీ స్విఫ్ట్ 15,542 యూనిట్లతో పదో స్థానంలో నిలిచింది.

Keerthy Suresh : వారంలో సినిమా రిలీజ్.. ప్రమోషన్స్ ఎక్కడ కీర్తి?

Exit mobile version