Cars Under 5 lakhs: రూ.5లక్షల్లోపు అందుబాటులో ఉన్న కార్లు ఇవే..
- కారు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబ సభ్యులకు మంచి అవకాశం
- గతంలో రూ.5 లక్షల లోపు ఎన్నో కార్లు
- ఇటీవల అమాంతం పెరిగిన కార్ల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు సైతం కారు కొనాలని ఆశ పడతారు. కానీ ఆర్థిక స్తోమత కారణంగా ఆ కలను నెరవేర్చుకోలేరు. గతంలో రూ.5 లక్షల లోపు ధర ఉన్న కార్లు ఎన్నో ఉండేవి. కానీ వీటి సంఖ్య దారుణంగా పడిపోయింది. ఇటీవల కార్ల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్న కార్లను ఇప్పుడు చూద్దాం.
READ MORE: WhatsApp: వాట్సాప్‌లోకి ఏఐ.. మీరు ఇక ఏదైనా తెలుసుకోవచ్చు!
Also Read
- 32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
- Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
- రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
మారుతి సుజుకి ఆల్టో K10 : మారుతి సుజుకి ఆల్టో దేశంలో అత్యంత నమ్మదగిన బ్రాండ్‌గా పేరొందింది. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు కూడా ఇదే. అయితే, ఆల్టో 800 కార్ల తయారీ గతేడాది నిలిచిపోయింది. ప్రస్తుతానికి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10) మోడల్స్ మాత్రమే ఇండియన్ మార్కెట్లోకి వస్తున్నాయి. దీని ధర రూ.3.99 లక్షలు(ఎక్స్ షోరూం). దీంట్లో 1.0 లీటర్ K10C పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 67ps పవర్, 89Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్ మ్యాన్యువల్ ఆప్షన్‌తో పనిచేస్తుంది.
మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో : మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో (Maruti Suzuki S-Presso) ఎక్స్ షోరూం ధర రూ.4.26 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 1.0 లీటర్ KB10C పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ మోటార్ గరిష్ఠంగా 67ps పవర్, 89Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. మంచి డిజైన్‌తో పాటు స్పేషియస్‌గా ఉండే వెహికల్ ఇది. ఇందులో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ దీని సొంతం. ఆడియో, వీడియో, ఫోన్ కంట్రోల్స్‌ను స్టీరింగ్ నుంచే కంట్రోల్ చేయవచ్చు. స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రూ.5 లక్షల లోపు వస్తున్న బెస్ట్ వేరియంట్ ఇది.
READ MORE: Sivaji: ఎట్టకేలకు సూపర్ ఛాన్స్ పట్టేసిన శివాజీ
రెనాల్ట్ క్విడ్ : రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) 0.8, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్లతో వస్తుంది. కానీ గతేడాది 0.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ ప్రొడక్షన్ నిలిచిపోయింది. ప్రస్తుతం 1.0 లీటర్ పెట్రోల్ మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది. క్విడ్ కారు ఎక్స్ షోరూం ధర రూ.4.69 లక్షలతో ప్రారంభం అవుతుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 68ps పవర్, 91Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీట్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
తాజావార్తలు
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!