NTV Telugu Site icon

Bike: బైక్‌లో ఈ పార్ట్ పాడైతే అంతే సంగతులు..మీరు కూడా చెక్ చేసుకోండి..

Bike

Bike

బైక్‌లో అనేక భాగా ఉంటాయి. మన ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా చేసే ముఖ్యమైన భాగం సస్పెన్షన్ సిస్టమ్(షాక్ అబ్జర్వర్). ఈ సస్పెన్షన్ సిస్టమ్ వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం సుఖవంతంగా మరుతుంది. సస్పెన్షన్ సిస్టమ్ లేకపోతే.. గుంతలు.. అధ్వాన రహదారిపై ప్రయాణం నరకంగా మారుతుంది. అందుకే ఈ సిస్టమ్ ను జాగ్రత్తగా చూసుకోవాలి. అడ్వెంచర్ బైక్‌లలో సస్పెన్షన్‌పై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే అడ్వెంచర్ బైక్‌లు కొండలు, కఠినమైన రోడ్లపై ప్రయాణించేలా తయారు చేస్తారు.

READ MORE: Anant Ambani Wedding: పెళ్లిలో ఎదురుపడ్డ ఐశ్వర్యరాయ్-రేఖ.. రియాక్షన్ ఇదే!

ఎన్ని రకాల సస్పెన్షన్‌లు ఉన్నాయి?
ముందు భాగంలోని ఫోర్క్ సస్పెన్షన్ ని బైక్ ఫ్రంట్ వీల్ కోసం రూపొందిస్తారు. దీనిని టెలిస్కోపిక్ ఫోర్క్ అని కూడా పిలుస్తారు. వెనుక సస్పెన్షన్.. ఇది బైక్ వెనుక చక్రానికి సంబంధించినది. దీనిని మోనోషాక్ లేదా డ్యూయల్ షాక్ అని పిలుస్తారు. ఈ సస్పెన్షన్ సిస్టమ్‌లు బైక్ రైడర్ స్థిరంగా ఉండేలా చేస్తాయి. సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కఠినమైన రోడ్లపై ప్రయాణాన్ని సుఖవంతంగా చేస్తాయి. కాబట్టి సస్పెన్షన్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటి పనితీరు క్రమంగా తగ్గుతుంది. బరువు మరియు రైడింగ్ శైలికి అనుగుణంగా సస్పెన్షన్‌ను సరిగ్గా సెట్ చేయండి. తయారీదారు పేర్కొన్న వ్యవధిలో సస్పెన్షన్‌ను అందించడం చాలా ముఖ్యం. మెరుగైన సస్పెన్షన్ గుంతలు వచ్చిప్పుడు టైర్లు గాల్లోకి ఎగరకుండా.. భూమిని ఆనుకునేలా చూస్తుంది. ఫలితంగా రైడర్ స్థిరంగా ఉంటారు. సస్పెన్షన్ బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇది చక్రాలను భూమికి కనెక్ట్ చేస్తుంది. ఇది మరింత ప్రభావవంతంగా ఆపడానికి ఉపయోగపడుతుంది. ఒక వేళ ఈ సిస్టమ్ సరిగ్గా పనిచేయకుంటే.. కొద్ది దూరం ప్రయాణించినా.. ఒంటి నొప్పులు ఎక్కువగా వస్తాయి. అందుకే దానిని జాగ్రత్తగా చూసుకోవాలి.