NTV Telugu Site icon

Bajaj Chetak: స్టైలిష్ లుక్‌తో.. తక్కువ ధరతో త్వరలో మార్కెట్లోకి

Bajaj Chetak

Bajaj Chetak

2020లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో రిలీజైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ స్కూటర్ అమ్మకాలు తక్కువగా ఉండగా.. ఆ తర్వాత కొత్త మోడల్స్, ధర తగ్గింపులు కారణంగా సేల్స్ పెరిగాయి. దీంతో.. ఈ స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. కాగా.. కంపెనీ మరో మోడల్‌ను విడుదల చేయబోతోంది. ఈ స్కూటర్ 2024 డిసెంబర్ 20న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. కాగా.. విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త బజాబ్ చేతక్‌లో ఎలాంటి ఫీచర్లు.. ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

కొత్త బజాజ్ చేతక్ మోడల్ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉండనుంది. ఈ స్కూటర్.. ఇతర స్కూటర్ల కంటే ఎక్కువ సామర్థ్యంతో రానుంది. అంతేకాకుండా.. ఫ్లోర్‌బోర్డ్ కింద బ్యాటరీ ప్యాక్‌ను రీపోజిషన్ చేసే కొత్త ఛాసిస్‌ని పొందుతుంది. దీంతో.. సీటు కింద ఎక్కువ నిల్వ స్థలం అందుబాటులో ఉంటుంది. అలాగే.. ఈ స్కూటర్‌లో కొత్త బ్యాటరీ ప్యాక్ డిజైన్‌తో, మరింత శ్రేణిని చూడవచ్చు. బజాజ్ చేతక్‌లో నియంత్రణ, నిర్వహణ కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్‌ని అప్‌డేట్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఇది మరింత శక్తిని అందించడమే కాకుండా, సురక్షితంగా కూడా ఉంటుంది. ఇందులో మరింత అధునాతన బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు.

Read Also: Kakinada Port PDS Rice: ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు

రేంజ్..
త్వరలో రానున్న బజాజ్ చేతక్ రేంజ్ 123 నుండి 137 కిలోమీటర్లు. దీని బేస్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 63 కిలోమీటర్లు, ఇతర వేరియంట్‌ల వేగం గంటకు 73 కిలోమీటర్లు. కొత్త చేతక్‌లో క్లాసిక్ డిజైన్ చెక్కుచెదరకుండా చూడవచ్చు. అలాగే.. కొత్త కలర్ ఆప్షన్లతో లాంచ్ కానుంది.

ధర..
ఇప్పటికే ఉన్న మోడల్ లాగానే, కొత్త చేతక్‌ను ఇతర వేరియంట్‌లతో అందించనున్నారు. కొత్త చేతక్ 2.88 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చినట్లయితే, దాని ధర రూ. 95,998 వరకు ఉంటుంది. అలాగే.. చేతక్ టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 1,27,244 వరకు ఉంటుంది. దీని స్పెషల్ ఎడిషన్ వెర్షన్ ధర రూ.1,28,744 వరకు ఉండవచ్చు.