2020లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో రిలీజైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ స్కూటర్ అమ్మకాలు తక్కువగా ఉండగా.. ఆ తర్వాత కొత్త మోడల్స్, ధర తగ్గింపులు కారణంగా సేల్స్ పెరిగాయి. దీంతో.. ఈ స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. కాగా.. కంపెనీ మరో మోడల్‌ను విడుదల చేయబోతోంది. ఈ స్కూటర్ 2024 డిసెంబర్ 20న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.