NTV Telugu Site icon

Tata punch-BMW accident: టాటా పంచ్‌ను ఢీకొట్టిన బీఎమ్‌డబ్ల్యూ స్పోర్ట్స్ కారు.. నుజ్జు నుజ్జైన బీఎండబ్ల్యూ!

Tata Punches Bmw Accident

Tata Punches Bmw Accident

రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ గేట్ ప్రాంతంలో పెను ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు మొదట టాటా పంచ్ కారును ఢీకొట్టి డివైడర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ.. ఈ ఘటనలో పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే బీఎండబ్ల్యూ కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. టాటా పంచ్ కారు స్వల్పంగా దెబ్బతింది.

READ MORE: Bangladesh: హిందువులపై జరుగుతున్న దాడిలను ఖండించిన ముస్లిం నేతలు.. యూనస్‌కు లేఖ

స్థానికుల కథనం ప్రకారం.. బీఎండబ్ల్యూ కారు అతివేగంతో వచ్చింది. అకస్మాత్తుగా టాటా పంచ్ కారును ఢీ కొట్టింది. ఆ తర్వాత బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల జనాలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. స్పోర్ట్స్ కారు నుంచి డ్రైవర్‌ను బయటకు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత ప్రమాదానికి గురైన కార్లను రోడ్డుపై నుంచి తొలగించారు. ఈ మొత్తం కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రాంతం రద్దీగా ఉండడంతో ప్రమాదం పెను ముప్పుగా మారే అవకాశం ఉందని ప్రజలు తెలిపారు. డ్రైవింగ్‌లో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, అధిక వేగంతో వాహనాలు నడపడం మానుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

READ MORE:RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య సమీక్ష.. ఈసారి కూడా వడ్డీరేట్లు యథాతథం

అయితే.. ఈ ప్రమాదంలో టాటా పంచ్ కారు స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది. బీఎండబ్ల్యూ కారు బాగా దెబ్బతింది. దీని గురించి సోషల్ మీడియాలో చర్చలు వైరల్‌గా మారాయి. టాటా డిల్డ్ క్వాలిటీ గురించి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏ కంపెనీ కార్ అయినా.. టాటా క్వాలిటీకి సలాం కొట్టాల్సిందే అంటూ పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.

Show comments