Tata punch-BMW accident: టాటా పంచ్‌ను ఢీకొట్టిన బీఎమ్‌డబ్ల్యూ స్పోర్ట్స్ కారు.. నుజ్జు నుజ్జైన బీఎండబ్ల్యూ!
- ఢిల్లీ గేట్ ప్రాంతంలో పెను ప్రమాదం
- వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు
- టాటా పంచ్‌ను ఢీకొట్టిన బీఎమ్‌డబ్ల్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ గేట్ ప్రాంతంలో పెను ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు మొదట టాటా పంచ్ కారును ఢీకొట్టి డివైడర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ.. ఈ ఘటనలో పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే బీఎండబ్ల్యూ కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. టాటా పంచ్ కారు స్వల్పంగా దెబ్బతింది.
READ MORE: Bangladesh: హిందువులపై జరుగుతున్న దాడిలను ఖండించిన ముస్లిం నేతలు.. యూనస్‌కు లేఖ
Also Read
- KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
- TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
- Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
స్థానికుల కథనం ప్రకారం.. బీఎండబ్ల్యూ కారు అతివేగంతో వచ్చింది. అకస్మాత్తుగా టాటా పంచ్ కారును ఢీ కొట్టింది. ఆ తర్వాత బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల జనాలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. స్పోర్ట్స్ కారు నుంచి డ్రైవర్‌ను బయటకు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత ప్రమాదానికి గురైన కార్లను రోడ్డుపై నుంచి తొలగించారు. ఈ మొత్తం కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రాంతం రద్దీగా ఉండడంతో ప్రమాదం పెను ముప్పుగా మారే అవకాశం ఉందని ప్రజలు తెలిపారు. డ్రైవింగ్‌లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అధిక వేగంతో వాహనాలు నడపడం మానుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
READ MORE:RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య సమీక్ష.. ఈసారి కూడా వడ్డీరేట్లు యథాతథం
అయితే.. ఈ ప్రమాదంలో టాటా పంచ్ కారు స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది. బీఎండబ్ల్యూ కారు బాగా దెబ్బతింది. దీని గురించి సోషల్ మీడియాలో చర్చలు వైరల్‌గా మారాయి. టాటా డిల్డ్ క్వాలిటీ గురించి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏ కంపెనీ కార్ అయినా.. టాటా క్వాలిటీకి సలాం కొట్టాల్సిందే అంటూ పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!