NTV Telugu Site icon

TESLA: భారత్‌లో టెస్లా తొలి షోరూం.. స్థలాన్ని అద్దెకు తీసుకున్న కంపెనీ.. ఎక్కడంటే?

Tesla Jobs

Tesla Jobs

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కి చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా. ఈ కంపెనీ భారత్‌లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది టెస్లా రాక కోసం ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణ అతి త్వరలో ముగియబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన మొదటి షోరూమ్ కోసం స్థలాన్ని చూసింది. షోరూమ్ కోసం కంపెనీ దాదాపు 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది.

READ MORE: Hyderabad: 22 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసిన వివాహిత.. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో..

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో టెస్లా తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించడానికి ఒక ఒప్పందాన్ని ఖరారు చేసింది. ప్రాపర్టీ మార్కెట్ వర్గాలను ఉటంకిస్తూ ఈ అంశాన్ని ఇండియా టుడే నివేదిక పేర్కొంది. టెస్లా కంపెనీ బీకేసీలోని వాణిజ్య కాంప్లెక్స్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది. దీని నెలవారీ అద్దె చదరపు అడుగుకు రూ. 900 అని చెబుతున్నారు. అంటే నెలకు దాదాపు రూ. 35 లక్షలు.

READ MORE: Amit Shah: ఇక ఉపేక్షించకండి.. మణిపుర్‌ పరిస్థితిపై అమిత్ షా కీలక ఆదేశాలు..

టెస్లా ఈ స్థలాన్ని 5 సంవత్సరాలకు గానూ అద్దెకు తీసుకుంది. ఇక్కడ కంపెనీ తన విస్తృత శ్రేణి కార్లను ప్రదర్శిస్తుంది. అన్నీ సరిగ్గా జరిగితే.. కంపెనీ ఏప్రిల్ నుంచి కార్ల అమ్మకాలను ప్రారంభించవచ్చు. ముంబైతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో కూడా టెస్లా షోరూమ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికోసం ఆ కంపెనీ ఢిల్లీలోని ఏరోసిటీలో షోరూమ్ కోసం స్థలం కోసం వెతుకుతోంది. అయితే, దీని గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు.