NTV Telugu Site icon

Tesla: భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్.. స్థలం కోసం కంపెనీ అధ్యయనం..

Tesla

Tesla

Tesla: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ అయిన భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎలక్ట్రిక్ కార్ దిగ్గజం టెస్లా సిద్ధమైంది. ప్రతిపాదిత 2-3 బిలియన్ డాలర్లతో దేశంలో ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఇందు కోసం దేశంలోని పలు ప్రాంతాలను టెస్లా బృందం అధ్యయనం చేస్తోందని తెలుస్తోంది. టెస్లా ప్రధాన మార్కెట్లైన అమెరికా, చైనాలో ఈవీల డిమాండ్ మందగిస్తున్న తరుణంలో, ఇప్పుడిప్పుడే ఈవీ మార్కెట్‌లో ఎదుగుతున్న భారత్‌పై టెస్లా దృష్టిసారించింది. ఆటో మాన్యుఫాక్చర్ హబ్‌లుగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలపై టెస్లా దృష్టి సారింస్తుందని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, టెస్లా మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదు.

Read Also: Nitish Kumar: “ఇక శాశ్వతంగా ఎన్డీయేలోనే ఉంటా”.. ప్రధాని ముందు నితీష్ కుమార్ వ్యాఖ్యలు..

గతంలో చైనా నుంచి భారత్‌కి కార్లను దిగుమతి చేయాలని టెస్లా భావించింది. అయితే, భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కట్టుబడి ఉంది. ఇండియాలోనే తయారైతేనే తప్పా కార్ల సంకాలను తగ్గించే ప్రసక్తే లేదని చెప్పింది. అయితే, కొన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు దేశంలో కనీసం 500 మిలియన్లు డాలర్లు పెట్టుబడి పెట్టి మూడేళ్లలోపు ఉత్పత్తిని ప్రారంభిస్తే దిగుమతి పన్నుల్ని తగ్గిస్తామని కేంద్రం కొత్త విధానం తీసుకువచ్చింది. కొత్త భారత విధానం ప్రకారం, కంపెనీలు తక్కువ పన్ను రేటుతో సంవత్సరానికి 8,000 కార్లను దిగుమతి చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే టెస్లా కార్ల ఎంట్రీని భారతదేశానికి చెందిన కార్ మేకర్ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఈవీ మార్కెట్‌లో టాటా మోటార్స్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2023లో భారతదేశంలోని మొత్తం కార్ల అమ్మకాలలో EVలు 2% ఉన్నాయి, ప్రభుత్వం 2030 నాటికి 30% లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు జర్మనీ నుంచి భారత్‌కి టెస్లా కార్లు దిగుమతి అయ్యే అవకాశం కనిపిస్తోంది. జర్మనీలో ఇప్పటికే టెస్లా రైట్ హ్యాండ్ డ్రైవ్(RHD) కార్ల తయారీ ప్రారంభమైంది.