Site icon NTV Telugu

Tata Sierra Top Speed Test: టాటా సియెర్రా ఫర్ఫామెన్స్ వేరే లెవల్ గురూ.. టాప్ స్పీడ్ ఎంతంటే..?

Tata Sierra

Tata Sierra

Tata Sierra 1.5 Hyperion Top Speed Test: టాటా మోటార్స్ తమ కొత్త Hyperion 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఒక పెద్ద విజయాన్ని సాధించింది. ఈ ఇంజిన్‌ను కొత్త టాటా సియెర్రా (Tata Sierra) హై వేరియంట్లలో ప్రవేశపెట్టారు. ఇండోర్‌లోని NATRAX టెస్ట్ ట్రాక్‌లో చేసిన హై-స్పీడ్ టెస్ట్‌లో ఈ ఇంజిన్ ఉన్న సియెర్రా 222 కిలోమీటర్లు గంట వేగాన్ని సాధించింది. దీంతో ఇది ఇప్పటివరకు వచ్చిన సియెర్రాల‌లో అత్యంత వేగవంతమైన మోడల్‌గా నిలిచింది. Hyperion 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కేవలం 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజిన్ Adventure+, Accomplished, Accomplished+ వేరియంట్లలోనే లభిస్తుంది. ఈ ఇంజిన్ ఉన్న మోడల్‌ ధరలు ఎక్స్-షోరూమ్ రూ.17.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

READ MORE: Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం భారీ సెట్.. ఎంట్రీ సాంగ్‌తోనే బాక్సాఫీస్ షేక్?

కొత్త టాటా సియెర్రా బయట నుంచి చూసేందుకు బాక్సీ డిజైన్‌తో పాత మోడల్‌ను గుర్తు చేసేలా కనిపిస్తుంది. నిలువుగా ఉన్న స్టాన్స్, గ్లోస్-బ్లాక్ ప్యానెళ్లతో LED హెడ్‌లైట్లు, DRLs, బ్రాండ్ లోగో, “Sierra” లెటరింగ్ అందంగా సూపర్‌ లుక్‌ను అందిస్తాయి. ముందువైపు బంపర్‌లో స్కిడ్ ప్లేట్, ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ లోపల ప్రీమియం ఇంటీరియర్ అమర్చారు. డాష్‌బోర్డ్‌పై మూడు డిస్‌ప్లేలు ఉంటాయి. ఒకటి డ్రైవర్ ముందు, రెండు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఏర్పాటు చేశారు. ఇవి ఒకే కంటెంట్‌ను షేర్ చేయగలవు. టాటా కర్వ్ నుంచి తీసుకున్న 4-స్పోక్ స్టీరింగ్ వీల్‌లో లైటింగ్ లోగో, టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. 12 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, సెగ్మెంట్‌లో తొలిసారి వచ్చిన SonicShaft సౌండ్‌బార్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, దేశంలో అతి పెద్ద ప్యానోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జర్, వెనుక సన్‌షేడ్స్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. లోపల సాఫ్ట్-టచ్ ప్యానెల్స్, ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్ సైతం అద్భుతంగా లగ్జరీ లుక్ ని ఇస్తుంది.

READ MORE: Starlink: అమెరికా, దుబాయ్, భూటాన్, బంగ్లాదేశ్‌లలో.. స్టార్‌లింక్ ప్లాన్ ధర ఎంతంటే?

సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారు లెవల్-2 ADAS ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ బ్లైండ్ స్పాట్ డిటెక్టర్లు, 21 ఫంక్షన్లతో ESP వంటివి ఉన్నాయి. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్, సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్లు, పిల్లల సేఫ్టీ కోసం ISOFIX సపోర్ట్, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో టాటా సియెర్రా ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా విడుదలైంది. ఈ ఎస్‌యూవీ బుకింగ్స్ డిసెంబర్ 16, 2025 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు జనవరి 15, 2026 నుంచి మొదలవుతాయి.

Exit mobile version