Tata Sierra Hexa: ఒకప్పుడు భారత ఆటోమొబైల్ రంగంలో డిజైన్ ఐకాన్‌గా నిలిచిన టాటా సియెర్రా SUV. ఇప్పుడు అదే సియెర్రా ఆధునిక రూపంలో తిరిగి వస్తూ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా, టాటా సియెర్రా డిజైన్ లో హెక్సా నేమ్‌ప్లేట్‌ను జోడించి 7-సీటర్ SUVగా రూపొందించిన ఒక డిజిటల్ రెండరింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, డిజిటల్ ఆర్టిస్ట్ షోయబ్ ఆర్. కలానియా రూపొందించిన ఈ రెండర్‌ను ఓ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు. ఈ కాన్సెప్ట్ SUVని చూస్తే.. టాటా నిజంగానే ఇలా తయారు చేస్తే మార్కెట్‌లో సంచలనం సృష్టించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read Also: Anaganaga Oka Raju : రాజు ఎలా ఉండాలో చెప్పిన రాజకుమారి.. మీనాక్షి
టాటా సియెర్రా హెక్సా ఎలా కనిపించనుంది..?
ఈ రెండర్‌లో చూపిన సియెర్రా హెక్సా ఒక బోల్డ్, మస్క్యులర్ లుక్ కలిగిన 7-సీటర్ SUVగా కనిపిస్తోంది. ఒరిజినల్ సియెర్రాకు ప్రత్యేకతైన గ్లాస్‌హౌస్ డిజైన్‌ను అలాగే ఉంచుతూ, ప్రాక్టికల్ అవసరాల కోసం ఫైవ్-డోర్ లేఅవుట్‌ను జత చేశారు. అలాగే, ముందు భాగంలో మరింత ఆకర్షణీయమైన, బాక్సీ ఫ్రంట్ ఫేసియా కనిపించనుంది. కొత్త డిజైన్ LED DRLs, వెడల్పైన గ్రిల్ SUVకి రోడ్ ప్రెజెన్స్‌ను పెంచుతున్నాయి. పొడవైన వీల్‌బేస్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు దీన్ని పెద్దదిగా మరియు ప్రీమియమ్‌గా చూపిస్తున్నాయి. వెనుక భాగంలో క్లిన్, మోడర్న్ టెయిల్‌గేట్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Read Also: Uber: డివైడర్ ను ఢీకొన్న ఉబర్ క్యాబ్.. ఐదు నెలల గర్భవతితో పాటు అమె తల్లికి తీవ్రగాయాలు
మార్కెట్‌లోకి ఏ కంపెనీతో పోటీ..?
టాటా మోటార్స్ నిజంగా ఈ సియెర్రా హెక్సాను ఉత్పత్తిలోకి తీసుకొస్తే, భారత్‌లోని హాట్ త్రీ-రో SUV సెగ్మెంట్‌లోకి అడుగుపెటినట్లైతుంది. అప్పుడు దీనికి ప్రధాన పోటీగా ఉండే వాహనాలు ఇవే:
* మహీంద్రా XUV7XO – టెక్నాలజీతో నిండిన క్యాబిన్, శక్తివంతమైన ఇంజిన్లు
* హ్యుందాయ్ ఆల్కాజార్ – అర్బన్ ఫ్యామిలీలకు అనువైన ప్రీమియమ్ SUV
* MG హెక్టర్ ప్లస్ – విశాలమైన ఇంటీరియర్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు
* టయోటా ఇన్నోవా హైక్రాస్ – కంఫర్ట్, నమ్మకానికి బెంచ్‌మార్క్
సియెర్రా లెగసీ
ఒరిజినల్ టాటా సియెర్రా 1990ల ప్రారంభంలో భారతదేశపు తొలి లైఫ్‌స్టైల్ SUVగా రిలీజ్ అయింది. మూడు డోర్లు, బలమైన నిర్మాణంతో అది అప్పట్లో ఒక ఐకాన్‌గా నిలిచింది. 2020 ఆటో ఎక్స్‌పోలో టాటా సియెర్రా కాన్సెప్ట్‌ను ప్రదర్శించి, ఆ నాస్టాల్జియాను ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో తిరిగి తీసుకొచ్చింది. కాగా, ఇప్పటికే కొత్త తరం సియెర్రా మార్కెట్‌లోకి రావడానికి సిద్ధమవుతుండగా, హెక్సా ప్రేరణతో 7-సీటర్ వెర్షన్ తీసుకొస్తే కుటుంబ అవసరాలు, SUV ప్రేమికుల అభిరుచులను ఒకేసారి తీరుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే, ప్రస్తుతం ఇది కేవలం డిజిటల్ రెండర్ మాత్రమే అయినప్పటికీ, టాటా సియెర్రా హెక్సా కాన్సెప్ట్ SUV అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. టాటా మోటార్స్ నిజంగా ఈ ఐడియాను వాస్తవంలోకి తీసుకొని వస్తుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.. ఈ డిజైన్ చూస్తే మార్కెట్‌లో టాటా సియెర్రా హెక్సా కాన్సెప్ట్ SUV ఈ హంగామా సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.