Tata Motors: టాటా నుంచి తొలి సీఎన్‌జీ కార్.. టియాగో ఎన్‌ఆర్‌జి సీఎన్‌జీ టీజర్ రిలీజ్.. ఫీచర్లు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors teases ‘India’s First Toughroader CNG: టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ కంపెనీ నుంచి టియాగో ఎన్‌ఆర్‌జి ఐసీఎన్‌జీ వెర్షన్ టీజర్ విడుదల చేసింది. దీనిని ‘ఇండియాస్ ఫస్ట్ టఫ్ రోడర్ సీఎన్‌జీ’గా అభివర్ణించింది. ‘‘భారతదేశం మొట్టమొదటి టఫ్ రోడర్ సీఎన్‌జీ, సరికొత్త టియాగో ఎన్‌ఆర్‌జి ఐసీఎన్‌జీ యెక్క శక్తి పరాక్రమంతో కొత్త యుగానికి దారి తీయండి, స్టే ట్యూన్డ్’’అంటూ శుక్రవారం టాటా మోటార్స్ కార్స్ ట్వీట్ చేసింది. టాటా విడుదల చేయబోయే టియాగో ఎన్‌ఆర్‌జి ఐసీఎన్‌జీ కారుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. టాటా మోటార్స్ టియగో, టిగోర్ లలో సీఎన్‌జీ కిట్ అమర్చింది. ఐ-సీఎన్‌జీ పేరుతో పిలుస్తోంది.
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ఫీచర్లు, ప్రత్యేకతలు:
సీఎన్‌జీ వెర్షన్ కు టియాగో ఐ-సీఎన్‌జీ మాదిరిగానే ఇంజన్, గేర్ బాక్స్ ఇవ్వబడుతాయి. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.2 లీటర్, 3 సిలిండర్ ఇంజిన్ ఉండనుంది. ఇది గరిష్టంగా 86 పీఎస్ శక్తిని 113 ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ , 5 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ తో వస్తుంది. అయితే సీఎన్‌జీ కిట్ మాన్యవల్ వెర్షన్ లో మాత్రమే ఇవ్వబడుతోంది. టాటా నుంచి టియాగో సీఎన్‌జీ వస్తే దీనికి ప్రస్తుతం మార్కెట్ లో పోటీలో ఏ ఇతర కారు లేదు. ఒక కేజీ సీఎన్జీకి దాదాపుగా 26.49 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే మారుతి సుజుకీ తన కార్లలో సీఎన్జీ వేరియంట్లను తీసుకువస్తోంది. ఆ పోటీని తట్టుకునేందుకు టాటా కూడా సీఎన్జీ వైపు దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ఇండియన్ మార్కెట్ లో టాప్ ప్లేసులో ఉంది టాటా. ఇప్పటికే టాటా నుంచి వచ్చిన నెక్సాన్ ఈవీ తన విక్రయాలను పెంచుకుంటోంది. ఇటీవల తొలిసారిగా హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తున్నట్లు తెలిపింది. టియాగో ఈవీని తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ కారు హాట్ కేక్ తరహాలో బుకింగ్స్ సంపాదించింది.
Make way for a new NRGetic era with the power and prowess of India's First Toughroader CNG – the all-new Tiago NRG iCNG.
Stay tuned! #TiagoNRG #LiveDifferent #UrbanToughroader #Drives #TataMotorsPassengerVehicles #Tiago #Hatchback #GNCAP #Cars #Offroad #Offroading pic.twitter.com/DIeSwbtCX5
— Tata Motors Cars (@TataMotors_Cars) November 11, 2022
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!