NTV Telugu Site icon

Tata Motors: టాటా నుంచి తొలి సీఎన్‌జీ కార్.. టియాగో ఎన్‌ఆర్‌జి సీఎన్‌జీ టీజర్ రిలీజ్.. ఫీచర్లు ఇవే..

Tiago Nrg Icng

Tiago Nrg Icng

Tata Motors teases ‘India’s First Toughroader CNG: టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ కంపెనీ నుంచి టియాగో ఎన్‌ఆర్‌జి ఐసీఎన్‌జీ వెర్షన్ టీజర్ విడుదల చేసింది. దీనిని ‘ఇండియాస్ ఫస్ట్ టఫ్ రోడర్ సీఎన్‌జీ’గా అభివర్ణించింది. ‘‘భారతదేశం మొట్టమొదటి టఫ్ రోడర్ సీఎన్‌జీ, సరికొత్త టియాగో ఎన్‌ఆర్‌జి ఐసీఎన్‌జీ యెక్క శక్తి పరాక్రమంతో కొత్త యుగానికి దారి తీయండి, స్టే ట్యూన్డ్’’అంటూ శుక్రవారం టాటా మోటార్స్ కార్స్ ట్వీట్ చేసింది. టాటా విడుదల చేయబోయే టియాగో ఎన్‌ఆర్‌జి ఐసీఎన్‌జీ కారుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. టాటా మోటార్స్ టియగో, టిగోర్ లలో సీఎన్‌జీ కిట్ అమర్చింది. ఐ-సీఎన్‌జీ పేరుతో పిలుస్తోంది.

Read Also: Union minister Pralhad Joshi: టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఎవరు నిర్మించినా ఇంటికి పంపిస్తాం.. కేంద్రమంత్రి వార్నింగ్

ఫీచర్లు, ప్రత్యేకతలు:

సీఎన్‌జీ వెర్షన్ కు టియాగో ఐ-సీఎన్‌జీ మాదిరిగానే ఇంజన్, గేర్ బాక్స్ ఇవ్వబడుతాయి. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.2 లీటర్, 3 సిలిండర్ ఇంజిన్ ఉండనుంది. ఇది గరిష్టంగా 86 పీఎస్ శక్తిని 113 ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ , 5 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ తో వస్తుంది. అయితే సీఎన్‌జీ కిట్ మాన్యవల్ వెర్షన్ లో మాత్రమే ఇవ్వబడుతోంది. టాటా నుంచి టియాగో సీఎన్‌జీ వస్తే దీనికి ప్రస్తుతం మార్కెట్ లో పోటీలో ఏ ఇతర కారు లేదు. ఒక కేజీ సీఎన్జీకి దాదాపుగా 26.49 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే మారుతి సుజుకీ తన కార్లలో సీఎన్జీ వేరియంట్లను తీసుకువస్తోంది. ఆ పోటీని తట్టుకునేందుకు టాటా కూడా సీఎన్జీ వైపు దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ఇండియన్ మార్కెట్ లో టాప్ ప్లేసులో ఉంది టాటా. ఇప్పటికే టాటా నుంచి వచ్చిన నెక్సాన్ ఈవీ తన విక్రయాలను పెంచుకుంటోంది. ఇటీవల తొలిసారిగా హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తున్నట్లు తెలిపింది. టియాగో ఈవీని తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ కారు హాట్ కేక్ తరహాలో బుకింగ్స్ సంపాదించింది.

Show comments