NTV Telugu Site icon

Tata Car: రూ. 6.20 లక్షల ధర.. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. ఈ టాటా కారు పేరిట మరో రికార్డు

Tata Punch

Tata Punch

కార్ల తయారీదారు టాటా మోటార్స్(టాటా మోటార్స్) కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా పంచ్ కొత్త మైలురాయిని సాధించింది. ఈ మోడల్ ఇప్పటివరకు 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇది టాటా పంచ్ సాధించిన భారీ విజయం. గతేడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా నిలిచింది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీ సరికొత్త మైలురాయిని సాధించింది. కాగా.. ఇటీవల సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్లతో సరికొత్త టాటా పంచ్​ లాంచ్ చేసింది. 10 వేరియంట్స్​లో ఆకర్షణీయమైన లుక్​లో దీన్ని డిజైన్ చేసింది. దీన్ని టాటా మోటార్స్ అధికారిక వెబ్​సైట్​లో బుక్​ చేసుకోవచ్చు. అయితే.. ఈ కారు ధర రూ. 6.20 లక్షల(ఎక్స్-షోరూమ్ ధర) నుంచి రూ.10.32 (ఎక్స్-షోరూమ్ ధర) వరకు ఉంది. దీని విశేషాలను వివరంగా తెలుసుకుందాం..

READ MORE: Maruti Suzuki Cars: డిజైర్ నుంచి వ్యాగన్ఆర్ వరకు.. పెరగనున్న మారుతీ కార్ల ధరలు.. లిస్ట్ ఇదే..

2024లో టాటా మోటార్స్ అడ్వెంచర్ ఎస్, అడ్వెంచర్ + ఎస్, ప్యూర్ (ఓ) తో సహా మూడు కొత్త వేరియంట్లను పంచ్​కు జోడించింది. దీనితో, టాటా పంచ్ ఇప్పుడు ప్యూర్, ప్యూర్ (ఓ), అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అడ్వెంచర్ సన్ రూఫ్, అడ్వెంచర్ + సన్ రూఫ్, అకంప్లీష్​డ్​ + సన్ రూఫ్, అకంప్లీష్​డ్​+ సన్ రూఫ్ అనే 10 వేరియంట్లలో లభిస్తుంది. మునుపటి మాదిరిగానే 1.2-లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ లేదా 84 బీహెచ్​పీ పవర్​, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఏఎంటీతో కనెక్ట్​ చేసి ఉంటుంది. మునుపటి మాదిరిగానే, 2024 టాటా పంచ్ కూడా అదే ఇంజిన్ కాన్ఫిగరేషన్​తో సీఎన్జీ ఆప్షన్​లో కూడా అందుబాటులో ఉంది. అయితే, సీఎన్జీతో 72 బీహెచ్​పీ పవర్​, 103 ఎన్ఎమ్ టార్క్ జనరేట్​ అవుతుంది.

READ MORE: Rajouri: రాజౌరి మిస్టరీ మరణాల వెనక విష పదార్థాలు.. బ్యాక్టీరియా, వైరస్‌ కాదు..

టాటా పంచ్ ఫీచర్లు:
ఆండ్రాయిడ్ ఆటోతో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్
ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే
వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
రియర్ AC వెంట్స్
గ్రాండ్ కన్సోల్​తో కూడిన ఆర్మ్‌రెస్ట్
టైప్-C ఫాస్ట్ USB ఛార్జింగ్ పోర్ట్
CNG ట్రిమ్‌
ట్రాన్స్ ​మిషన్: మాన్యువల్, ఏఎంటీ గేర్​బాక్స్​