NTV Telugu Site icon

Tata Electric Bike: కుర్రాళ్లు గెట్ రెడీ.. టాటా ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 200KM రేంజ్!

Tata Ev Bike

Tata Ev Bike

దేశంలో టాటా కంపెనీకి చెందిన ప్రొడక్ట్స్ పై నమ్మకం ఎలా ఉంటుందో వేరే చెప్పక్లర్లేదు. టాటా దేశ ప్రజలకు ఓ నమ్మకమైన బ్రాండ్. టాటా ఉత్పత్తులు వాడని విలేజ్ ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అది వాహనాలైనా, ఇతర ప్రొడక్ట్స్ అయినా కచ్చితంగా యూజ్ చేస్తుంటారు. ఇక వెహికల్స్ విషయానికి వస్తే టాటా కార్లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంటుది. ప్రస్తుతం వాహనదారులంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో ఎలక్ట్రిక్ కార్లను రూపొందించే పనిలో పడింది. త్వరలోనే టాటా నానో ఈవీని లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తనదైన ముద్ర వేసిన టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy: ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం..

సూపర్ ఫీచర్స్ తో అదిరిపోయే డిజైన్ తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను లాంఛ్ చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. కుర్రాళ్లను అట్రాక్ట్ చేసే విధంగా స్టన్నింగ్ లుక్ లో రూపొందించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో టాటా ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన న్యూస్ హల్ చల్ చేస్తోంది. పలు నివేదికల ప్రకారం టాటా ఎలక్ట్రిక్ బైక్ సింగిల్ ఛార్జ్ తో 200 కిమీల దూరం ప్రయాణించే వీలుంటుందని తెలుస్తోంది. ఈ బైక్ గంటకు 80-100 కి.మీల గరిష్ట వేగంతో దూసుకెళ్తుందని ఆటో మొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యం కూడా దీని ఫీచర్లలో ఉంటుందిన తెలుస్తోంది.

APPSC: 8 పోటీ పరీక్షల తేదీల ప్రకటన.. ఏ టెస్ట్‌ ఎప్పుడంటే..?

టాటా పవర్ ద్వారా కంపెనీ ఇప్పటికే భారతదేశం అంతటా ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించే పనిలో ఉంది. టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ బైక్ ను స్మార్ట్ కనెక్టివిటీ, విభిన్న పరిస్థితుల కోసం మల్టీ రైడింగ్ మోడ్‌లతో సహా సాంకేతికతతో రూపొందించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ టాటా ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. లక్ష వరకు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. టాటా ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి లాంఛ్ అయితే టూ వీలర్ తయారీ కంపెనీలకు గట్టిపోటినిస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Show comments