Tata cars: జీఎస్టీ స్లాబ్ తగ్గింపుతో వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుత అవకాశం లభించిందని చెప్పవచ్చు. కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారు, ఇప్పుడు సరిగా ప్లాన్ చేసుకుంటే లక్షల్లో డబ్బును ఆదా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22,2025 నుంచి సవరించిన జీఎస్టీ అమలులోకి వస్తున్న తరుణంలో, తమ వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందిస్తామని దేశీయ కార్ మేకర్ టాటా ప్రకటించింది.
Read Also: కేరళ సంస్కృతిలో మునిగిన మౌనీ రాయ్… ఓనం చీర లుక్‌తో సోషల్ మీడియాలో హవా!
56వ సమావేశంలో, GST కౌన్సిల్ చిన్న కార్లు, 350cc వరకు మోటార్ సైకిళ్ళు, త్రిచక్ర వాహనాలు, బస్సులు, ట్రక్కులు మరియు అంబులెన్స్‌లపై పన్ను రేట్లను 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించింది.పెట్రోల్ కోసం 1,200cc మరియు డీజిల్ కోసం 1,500cc మించని ఇంజిన్ సామర్థ్యం కలిగిన 4 మీటర్ల కంటే తక్కువ పొడవు గల కార్లను చిన్న కార్లుగా భావిస్తారు. గతంలో వీటిపై 28 శాతం జీఎస్టీ, 1 శాతం సెస్సుతో పోలిస్తే , ఇప్పుడు సెస్సు లేకుండా 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. 4 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు ఉండీ, పెట్రోల్ 1200 సీసీ, డీజిల్ 1500 కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఇంజన్లు కలిగిన కార్లకు 40 శాతం జీఎస్టీ, సెస్సు లేకుండా విధించబడింది. గతంలో వీటికి 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్సు ఉండేది.
తగ్గబోయే జీఎస్టీకి అనుగుణంగా టాటా కంపెనీ కార్ల ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఈ కార్లపై రూ. 75,000 నుంచి రూ. 1.50 లక్షల వరకు డబ్బులను కస్టమర్లు ఆదా చేసుకోవచ్చు.
*టియాగో: రూ. 75,000 వరకు
*టిగోర్: రూ. 80,000 వరకు
*ఆల్ట్రోజ్: రూ. 1.10 లక్షలు
*పంచ్: రూ. 85,000
*నెక్సాన్: రూ. 1.55 లక్షలు
*కర్వ్: రూ. 65,000
*హారియర్: రూ. 1.40 లక్షలు
*సఫారి: రూ. 1.45 లక్షలు
