NTV Telugu Site icon

Tata Punch: టాటా ‘పంచ్’ అదిరింది.. అమ్మకాల్లో జోరు.. టాప్ 10 కార్లు ఇవే..

Tata Punch

Tata Punch

Tata Punch: దేశీయ కార్ మేకర్ టాటా మోటార్స్ అమ్మకాల్లో జోరు చూపిస్తోంది. నెక్సాన్, టియాగో, పంచ్, ఆల్ట్రోజ్, సఫారీ, హారియర్ వంటి మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంటోంది. ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్, పంచ్, టియాగో, టిగోర్ ఈవీ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా తన ‘పంచ్’ పవర్ చూపిస్తోంది. గత నాలుగు నెలల అమ్మకాలను పరిశీలిస్తే టాటా పంచ్ అత్యధికంగా అమ్ముడైన కార్‌గా నిలిచింది.

భారతీయ మార్కెట్‌లో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకీ అధిపత్యం చెలాయిస్తుంది. ఈ కంపెనీ నుంచి వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, ప్రాంక్స్, బ్రెజ్జా, ఎర్టిగా అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లుగా ఉన్నాయి. ఆ తర్వాత హ్యుందాయ్ం నుంచి గ్రాండ్ ఐ10నియోస్, ఐ20, వెన్యూ, క్రేటా వంటి కార్లు కూడా బాగానే అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. జనవరి-ఏప్రిల్ మధ్య కార్ల అమ్మకాలను పరిశీలిస్తే టాప్-10 కార్ల అమ్మకాల్లో టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచింది.

జపనీస్, కొరియన్ బ్రాండ్లను కాదని టాటా సత్తా చాటుతోంది. ఇప్పటికే కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. టాప్-10 కార్ల జాబితాలో చోటు సంపాదించుకుంది. పంచ్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 73,121 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది మరియు వ్యాగన్ఆర్, 71,386 యూనిట్లు మరియు బాలెనో 66,784 యూనిట్లు వంటి మోడళ్లతో పోలిస్తే ముందు వరసలో ఉంది.

Read Also: Pm Modi: ఎన్నికల ప్రచారంలో మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు కాల్

2024లో ఇప్పటివరకు అమ్ముడైన టాప్ -10 కార్లు(జనవరి-ఏప్రిల్):

1. టాటా పంచ్ – 73,121 యూనిట్లు
2. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ – 71,386 యూనిట్లు
3 .మారుతి సుజుకి బాలెనో – 66,784 యూనిట్లు
4. మారుతి సుజుకి డిజైర్ – 64,329 యూనిట్లు
5. మారుతి సుజుకి బ్రెజా – 62,795 యూనిట్లు
6. హ్యుందాయ్ క్రెటా – 60,393 యూనిట్లు
7. మహీంద్రా స్కార్పియో – 59,302 యూనిట్లు
8. మారుతీ సుజుకి ఎర్టిగా – 58,583 యూనిట్లు
9. టాటా నెక్సాన్ – 56,803 యూనిట్లు
10. మారుతీ సుజుకి ఫ్రాంక్స్ – 54,628 యూనిట్లు

టాటా పంచ్ ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్(ICE) మరియు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రూపంలో అందుబాటులో ఉంది. పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ ఇంధన ఆఫ్షన్లను కలిగి ఉంది. ICE మోడల్ 5-స్పీడ్ MT మరియు 5-స్పీడ్ AMT ఎంపికలతో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (88PS మరియు 115Nm)ని కలిగి ఉంది. ఈవీ రెండు బ్యాటరీ ఆఫ్షన్లతో అందుబాటులో ఉంది. 25kWh బ్యాటరీ 315 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. 35kWh బ్యాటరీ ప్యాక్ 421కి.మీ రేంజ్‌ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. టాటా పంచ్ ICE ధర రూ. 6.13 లక్షల నుండి రూ. 10.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, టాటా పంచ్.ఎవ్ ధర రూ. 10.99 లక్షల నుండి రూ. 15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.