Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Aeris: టాటా మోటార్స్ తన కాంపాక్ట్ సెడాన్ కార్ అయిన టిగోర్‌ను సరికొత్త అవతారంలో ఒక కొత్త పేరుతో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మామూలుగా చిన్న చిన్న మార్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ మోడల్‌గా అమ్మడం కాకుండా, దీనికి “టాటా ఏరిస్” (Tata Aeris) అనే కొత్త పేరుతో ఒక సరికొత్త గుర్తింపు ఇవ్వాలని చూస్తోంది. ఈ పేరు కోసం TATA AERIS అనే ట్రేడ్‌మార్క్‌ను కూడా కంపెనీ ఇప్పటికే రిజిస్టర్ చేయించింది. ఈ కొత్త సెడాన్ కార్ 2026, సెప్టెంబర్ 25న లాంచ్ కాబోతోంది. ఈ కొత్త టాటా ఏరిస్ డిజైన్, లుక్స్ విషయంలో పెద్ద ఎత్తున మార్పులు కనిపించబోతున్నాయి. కార్ ఫ్రంట్ భాగంలో సన్నని హెడ్‌లైట్స్, బ్లాక్ కనెక్టింగ్ ఎలిమెంట్, పెద్ద స్పోర్టీ బంపర్‌ను అందించారు. ఇవి కార్కి వ్యాన్ లాంటి లుక్ కాకుండా మంచి స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. కొత్త డిజైన్ ఉన్న అలాయ్ వీల్స్, కొత్త టెయిల్ లైట్స్, కొత్త రియర్ బంపర్ ఇందులో కనిపించనున్నాయి. అయితే కార్ ఓవరాల్ సెడాన్ షేప్ మాత్రం మునుపటిలాగే ఉంటుంది.
ఇంటీరియర్, హైటెక్ ఫీచర్ల విషయానికి వస్తే, ఏరిస్ క్యాబిన్ ఇటీవల వచ్చిన టియాగో ఫేస్‌లిఫ్ట్ తరహాలోనే ఉండే అవకాశం ఉంది. ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే సపోర్ట్ చేసే 10.25-ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను ఇస్తున్నారు. డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, కొత్త స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు, ఎలక్ట్రికల్లీ ఫోల్డింగ్ మిర్రర్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తారని అంచనా. ఇక, ఇంజిన్ ఆప్షన్లలో టాటా ఏరిస్ పెట్రోల్, సిఎన్జి, ఎలక్ట్రిక్ (EV) మోడళ్లలో రానుంది. పెట్రోల్ వేరియంట్లో 1.2-లీటర్ ఇంజిన్ ఉంటుంది, ఇది 86 PS పవర్, 113 Nm టార్క్‌ను అందిస్తుంది. కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి కిట్ ఉన్న వేరియంట్ సిఎన్జి మోడ్‌లో 75.5 PS పవర్, 96.5 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ రెండింటిలోనూ 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి. పెట్రోల్, సిఎన్జిలతో పాటు ఈ కార్ ఎలక్ట్రిక్ మోడల్ (Aeris.ev) ను కూడా కంపెనీ పరిచయం చేయనుంది. మన దేశంలో కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ వంటి కార్ల హవా నడుస్తోంది. వీటితో పోలిస్తే టిగోర్ అమ్మకాల్లో కాస్త వెనుకబడిపోతోంది. అందుకే కేవలం ఫేస్‌లిఫ్ట్‌గా కాకుండా టాటా ఏరిస్ అనే పూర్తి కొత్త పేరుతో, సరికొత్త ఫీచర్లతో తీసుకువస్తే కస్టమర్లను మరింతగా ఆకట్టుకోవచ్చని టాటా మోటార్స్ భావిస్తోంది.
Also Read
- Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
- TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
తాజావార్తలు
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!