రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Aeris Launched: టాటా మోటార్స్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో మరో కొత్త కార్‌తో మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అదే ‘టాటా ఏరిస్’ (TATA Aeris). ఇప్పటివరకు ఉన్న టాటా టిగోర్ స్థానంలో ఈ కొత్త కారును కంపెనీ లాంచ్ చేసింది. మార్కెట్లో ఇప్పటికే హవా సృష్టిస్తున్న మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ లాంటి పాపులర్ కార్లకు ఏరిస్ గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతి డిజైర్ కార్లు ఎక్కువగా టాక్సీలు, క్యాబ్‌లుగా వాడుతుంటారు కానీ, టాటా మాత్రం ఈ ఏరిస్‌ను పూర్తిగా ఒక పర్సనల్ కార్గా, ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఛాయిస్‌గా ప్రమోట్ చేస్తోంది. టిగోర్‌తో పోలిస్తే ఇందులో డిజైన్ మాత్రమే కాదు, సేఫ్టీ అండ్ ఫీచర్లలో కూడా టాటా రేంజ్ పెంచేసింది. ఇక, దీని ధర .రూ. 5.49 – 8.83 లక్షలు(ఎక్స్ షోరూం) వరకు ఉంటుంది.
ఈ కారులో ఉన్న ముఖ్యమైన విశేషాల విషయానికి వస్తే.. ఇది పెట్రోల్ తో పాటు సిఎన్జీ (CNG) ఆప్షన్లో కూడా లభిస్తుంది. సిఎన్జీ వేరియంట్లో టాటాకు ఉన్న ప్రత్యేకత ట్విన్/డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ, అది ఇందులోనూ ఉంది. కారు లోపల ఇంటీరియర్ కొంతవరకు టాటా టియాగోను పోలి ఉన్నప్పటికీ, ఫీచర్లు మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ మీద 10.25 ఇంచుల పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మెరుస్తాయి. ప్రీమియం లుక్ కోసం లెథర్ సీట్లు, ఎండకాలంలో హాయిగా ఉండేందుకు వెంటిలేటెడ్ సీట్లు ఇచ్చారు. వీటితో పాటు ఇన్-బిల్ట్ డ్యాష్‌క్యామ్, 360 డిగ్రీ కెమెరా కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో అన్నింటికీ టచ్ స్క్రీన్లు ఇచ్చేస్తుంటే, ఏరిస్‌లో ఏసీ అలాగే ఇతర కంట్రోల్స్ కోసం ఫిజికల్ బటన్స్ ఇవ్వడం చాలా మంచి విషయం. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇవి వాడటం చాలా సులువు.
Also Read
- Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
- Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
- Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
- New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
సేఫ్టీ విషయంలో టాటా ఎప్పుడూ తగ్గేదేలే అంటుంది. ఏరిస్‌లో కూడా అదే చూపించింది. ఈ కారు ఎంత స్ట్రాంగ్ అని చెప్పడానికి కంపెనీ ఒక షాకింగ్ టెస్ట్ కూడా చేసి చూపించింది. సిఎన్జీ కారు పైన ఏకంగా లారీ మట్టి/మల్బాని కుమ్మరించారు. ఆ బరువుకి కింద పడి నలిగిపోయినా, బయటికి తీశాక కారు హ్యాపీగా స్టార్ట్ అయ్యి నడిచింది! దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత సేఫ్ కారో. ఇక ఫీచర్ల పరంగా చూస్తే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి. వీటితో పాటు బ్లైండ్ వ్యూ మానిటరింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ (TPMS), హిల్ హోల్డ్ కంట్రోల్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అలర్ట్ వెళ్లేలా పోస్ట్ క్రాష్ SOS సపోర్ట్, పానిక్ నోటిఫికేషన్స్ లాంటి ఎన్నో అడ్వాన్స్డ్ సేఫ్టీ ఆప్షన్లు ఇందులో ఇచ్చారు.
ఇక ఇంజిన్ పవర్ విషయానికి వస్తే… పెట్రోల్ వేరియంట్ 86 పిఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. సిఎన్జీ వేరియంట్ 75.5 పిఎస్ పవర్, 96.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సాధారణంగా సిఎన్జీ కార్లు పెట్రోల్లోనే స్టార్ట్ అవుతాయి, కానీ ఈ కారును నేరుగా సిఎన్జీ మోడ్‌లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో భారీగా 70 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. ఇండియన్ రోడ్ల పరిస్థితి మనకు తెలిసిందే కదా, అందుకే దానికి తగ్గట్టుగానే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. సస్పెన్షన్‌ను కూడా మన రోడ్లకు తట్టుకునేలా ట్యూన్ చేశారు. డ్రైవింగ్ అనుభవాన్ని మార్చేందుకు ఆటోమేటిక్ (AMT) వేరియంట్లో పాతకాలపు గేర్ లివర్‌ను తీసేసి, స్టైలిష్‌గా ఉండే కాంపాక్ట్ నాబ్‌ను పెట్టారు. స్పోర్టీగా డ్రైవ్ చేయాలనుకునే వారి కోసం స్టీరింగ్ వెనకాల ప్యాడిల్ షిఫ్టర్లు కూడా అందించడం విశేషం. సిఎన్జీ ఆటోమేటిక్ కాంబినేషన్లో కూడా ఇది లభించనుంది. ఫ్యామిలీ కోసం ఒక మంచి సేఫ్, ఫీచర్ రిచ్ కారు కోరుకునేవారికి టాటా ఏరిస్ మంచి ఆప్షన్ కానుంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
-
Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!