Hyundai Creta 2027: క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. అదరగొడుతున్న నెక్స్ట్-జెన్ క్రెటా.. ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Creta 2027: హ్యుందాయ్ క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. థర్డ్ జెనరేషన్ క్రెటా SUV భారత్‌లో తన చివరి దశ టెస్టింగ్‌లో బిజీగా ఉంది. గతంలో దేశ విదేశాల్లో పలుమార్లు కనిపించిన ఈ కారు, తాజాగా మరోసారి స్పై షాట్స్‌లో చిక్కింది. ఈసారి గుర్గావ్ (ఎన్సీఆర్) తో పాటు మంచు కొండల మనాలీలో ఈ టెస్ట్ మోడల్స్ కనిపిస్తాయి. విశేషమేమిటంటే, ఈసారి కనిపించిన వేరియంట్లలో ఒక బేస్ వేరియంట్, అలాగే డిజిల్ వర్షన్ ఉన్నాయి. మనాలీలో సంచరించిన ఈ కారు నుంచి వచ్చిన ఇంజిన్ సౌండ్ ఆధారంగా అది డీజెల్ వర్షన్ అని స్పష్టమైంది. అలాగే ఈ ఎస్యూవీ 205/65 R16 టైర్లతో, స్టీల్ వీల్స్, వీల్ కవర్లతో కనిపించడంతో ఇది లోయర్ వేరియంట్ అని అర్థమవుతోంది. అంటే హ్యుందాయ్ కేవలం టాప్-ఎండ్ మోడల్స్ మాత్రమే కాకుండా, అన్ని వేరియంట్లను ఇండియన్ రోడ్లపై క్షుణ్ణంగా పరీక్షిస్తోందని తెలుస్తోంది.
డిజైన్ విషయానికి వస్తే, కొత్త క్రెటా ప్రస్తుత మోడల్ కంటే మరింత పెద్దగా, పవర్ ఫుల్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. హ్యుందాయ్ ‘ఆర్ట్ ఆఫ్ స్టీల్’ డిజైన్ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తుండటంతో ఈ కారు కొద్దిగా బాక్సీ, యాంగులర్ షేప్‌లో కనిపిస్తుంది. ముందు భాగంలో నిలువుగా ఉండే డిజైన్, స్లాటెడ్ ఎలిమెంట్స్‌తో కూడిన బంపర్, సరికొత్త గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లాంప్స్, బోనెట్‌పై ఎత్తుగా అమర్చిన H-షేప్ ఎల్ఈడీ DRLలు రానున్నాయి. పక్క నుంచి చూస్తే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, గుండ్రటి వీల్ ఆర్చ్‌లు, కాస్త వంగినట్లుండే రూఫ్‌లైన్, యాంగులర్ విండో ఫ్రేమ్‌లు ఆకట్టుకుంటాయి. ఇక వెనుక భాగంలో స్లోపింగ్ విండ్‌షీల్డ్, రూఫ్ స్పాయిలర్, పెద్ద బంపర్, ఫ్లాట్ బూట్ లిడ్ ఉంటాయి. ఫ్రంట్ లుక్కు తగినట్లే వెనుక వైపు కూడా కొత్త తరహా టైల్ లాంప్స్ రానున్నాయి.
Also Read
- Cyclone Murasu: తీరం దాటిన మురసు తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు!
- Graduate MLC: మీరు ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? CEO సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన..
- Smartphones: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 100W ఛార్జింగ్.. తక్కువ ధరల్లో మార్కెట్లోకి..
- Driving License: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులువు.. ఇంటి నుంచే పరీక్ష..
‘SX3’ అనే ఇంటర్నల్ కోడ్‌నేమ్‌తో రూపొందుతున్న ఈ కొత్త క్రెటా, కొత్త తరం కియా సెల్టోస్ ఉపయోగించిన ‘K3’ ప్లాట్‌ఫామ్‌పైనే తయారవుతోంది. సెల్టోస్ పొడవు, వెడల్పు, వీల్‌బేస్ పెరిగినట్లే.. క్రెటా కూడా పరిమాణంలో పెద్దది కానుంది. దీనివల్ల కారు లోపల క్యాబిన్ స్పేస్ మరింత ఎక్కువగా లభిస్తుంది. హ్యుందాయ్ ఇంకా అధికారిక ఫీచర్ల జాబితాను వెల్లడించనప్పటికీ, భారీ అప్‌గ్రేడ్స్ ఉండబోతున్నాయి. ప్రధానంగా కొత్త ‘Pleos Connect’ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో కనిపించనుంది. వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్ 2 ADAS సేఫ్టీ ఫీచర్లు, పవర్డ్ బాస్ మోడ్, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి మోడర్న్ ఫీచర్లు కొనసాగనున్నాయి.
ఇంజిన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న 1.5-లీటర్ పెట్రోల్, డీజెల్, టర్బో పెట్రోల్ ఆప్షన్లు అలాగే ఉండే అవకాశముంది. వీటితో పాటు కొత్తగా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కూడా తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లోని సెల్టోస్‌లో 1.6-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన ఎలక్ట్రిక్ మోటార్లు (eAWD తో) ఉండగా, ఇండియా కోసం మాత్రం క్రెటాలో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఆధారిత హైబ్రిడ్ సిస్టమ్‌ను అందించే ఆలోచనలో ఉంది. ఈ ఆల్-న్యూ హ్యుందాయ్ క్రెటా 2027 మొదటి భాగంలో మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వచ్చాక ఇది మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, టాటా సియెర్రా, హోండా ఎలివేట్ వంటి పాపులర్ మిడ్‌సైజ్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
తాజావార్తలు
-
Hyundai Creta 2027: క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. అదరగొడుతున్న నెక్స్ట్-జెన్ క్రెటా.. ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Cyclone Murasu: తీరం దాటిన మురసు తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు!
-
Graduate MLC: మీరు ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? CEO సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన..
-
Smartphones: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 100W ఛార్జింగ్.. తక్కువ ధరల్లో మార్కెట్లోకి..
-
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులువు.. ఇంటి నుంచే పరీక్ష..
ట్రెండింగ్
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!