Skoda Kylaq: స్కోడా కైలాక్ బుకింగ్స్ ప్రారంభం.. ఫీచర్లు, వివరాలు ఇవే..!
- భారత మార్కెట్లో కొత్త SUV స్కోడా కైలాక్ విడుదల
- కొందరు డీలర్లు అనధికారికంగా బుకింగ్ ప్రారంభం
- అధికారికంగా డిసెంబర్ 2 నుండి బుకింగ్స్ ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెక్ రిపబ్లిక్ ఆటోమొబైల్ తయారీదారు స్కోడా భారత మార్కెట్లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో కొత్త SUV స్కోడా కైలాక్‌ను విడుదల చేసింది. అందు కోసం కొందరు డీలర్లు అనధికారికంగా బుకింగ్ ప్రారంభించారు. ఏ ధరకు ఈ కారును బుక్ చేసుకోవచ్చు? కంపెనీ అధికారికంగా బుకింగ్ ఎప్పుడు ప్రారంభిస్తుంది.. అందులో ఎలాంటి ఫీచర్లు అందిస్తుందో తెలుసుకుందాం.
Read Also: Minister Nadendla Manohar: నేటితో 1050 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు..
Also Read
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
- Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
- Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
- BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
బుకింగ్ అనధికారికంగా ప్రారంభం:
మీడియా నివేదికల ప్రకారం.. కొందరు డీలర్లు స్కోడా కైలాక్ SUV కోసం అనధికారిక బుకింగ్‌లు ప్రారంభించారు. అయితే.. కంపెనీ ఈ SUV కోసం అధికారికంగా 2024 డిసెంబర్ 2 నుండి బుకింగ్‌ను ప్రారంభించనుంది. ఈ SUVని కంపెనీ ఈనెల (నవంబర్ 6)న ఇండియాలో విడుదల చేసింది. ఆ తర్వాత కంపెనీ తన బేస్ వేరియంట్‌ల ధరలను ప్రకటించింది. దీని బుకింగ్‌తో పాటు ఇతర వేరియంట్‌ల సమాచారం, ధరలు డిసెంబర్ 2న ప్రకటించనున్నారు. కైలాక్‌ను కొనుగోలు చేసే ముందు ముందస్తు బుకింగ్ కోసం స్కోడా ద్వారా క్లబ్‌ను కూడా ప్రకటించారు. బుకింగ్ సమయంలో సభ్యత్వానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఫీచర్లు:
స్కోడా కైలాక్‌లో మెరిసే బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, LED హెడ్‌లైట్లు, LED DRL, LED టెయిల్ లైట్లు, డ్రైవర్,.. కో-డ్రైవర్ కోసం 6-వే ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సీట్లు, ముందు వెంటిలేటెడ్ సీట్లు, సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 20.32 సెం.మీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, 25.6 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ట్రంక్‌లో మూడు కిలోల కెపాసిటీ హుక్ వంటి అనేక ఫీచర్లు అందించారు. స్కోడా కైలాక్ SUVలో భద్రతపై చాలా శ్రద్ధ చూపారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ డిస్క్ వైపింగ్, ESC, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, మల్టీ కొలిజన్ బ్రేక్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా.. ఈ SUVలో 25 కంటే ఎక్కువ యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్‌లు ప్రామాణికంగా అందించారు.
శక్తివంతమైన ఇంజన్:
కైలాక్ SUVలో స్కోడా ఒక లీటర్ కెపాసిటీ గల TSI ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది 85 కిలోవాట్ల శక్తిని, 178 న్యూటన్ మీటర్ల టార్క్‌ను పొందుతుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్, DCT ట్రాన్స్‌మిషన్ ఎంపికను కలిగి ఉంది.
ధర:
కంపెనీ ప్రస్తుతం స్కోడా కైలాక్ బేస్ వేరియంట్ ధరను పబ్లిక్ చేసింది. రూ.7.89 లక్షల ఎక్స్-షోరూమ్ ధర. కంపెనీకి సంబంధించి ఇతర వేరియంట్ల ధరలు డిసెంబర్‌లో ప్రకటించనున్నారు. ఈ SUV కోసం బుకింగ్ 2024 డిసెంబర్ 2 నుండి ప్రారంభమవుతుంది. దీని కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్ షోరూమ్‌ల నుండి బుకింగ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా.. ఈ SUV డెలివరీ 2025 జనవరి 27 నుండి ప్రారంభమవుతుంది. జనవరిలో జరగనున్న భారత్ మొబిలిటీ 2025లో ఈ కారును ప్రదర్శించనున్నారు. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో స్కోడా కైలాక్‌కు పోటీగా.. మారుతి సుజుకి బ్రీజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ వంటి కార్లు ఉన్నాయి. రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్‌లతో కూడా స్కోడా కైలాక్ పోటీపడుతుంది.
తాజావార్తలు
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
-
Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?