Skoda Kushaq Facelift: భారతీయ మార్కెట్‌లోకి స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్(Skoda Kushaq Facelift)ను ఆవిష్కరించారు. మార్చి 2026లో ఈ కార్ లాంచ్ కానుంది. కార్‌కు సంబంధించి ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొత్త కుషాక్, పాత కుషాక్‌తో పోలిస్తే డిజైన్, క్యాబిన్, పవర్ ట్రెయిన్‌లలో మార్పులతో వస్తోంది. ఎంట్రీ వెర్షన్‌తో పాటు ఈ SUV మెంటే కార్లో వెర్షన్‌ను కూడా స్కోడా అన్‌విల్ చేసింది. కైలాక్ స్పోర్ట్‌లైన్, కోడియాక్ RS, ఆక్టేవియా RSలు వంటి కార్లు స్కోడా నుంచి వస్తున్న తరుణంలో కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకువచ్చింది.
కొత్త కుషాక్ హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకి విక్టోరిస్, టాటా సియెర్రాలతో పాటు రాబోతున్న రెనాల్ట్ డస్టర్‌కు పోటీ ఉండనుంది.
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్: డిజైన్
కొత్త కుషాక్, స్కోడా పాత కార్ల డిజైన్‌లో కొన్ని ప్రధాన మార్పులతో వస్తోంది. కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్, కనెక్టెడ్ DRLలు కొత్త కారులో ఉన్నాయి. డిజైన్‌కు అనుగుణంగా పియానో బ్లాక్, క్రోమ్ ఎలిమెంట్ లతో కొత్త గ్రిల్ ఉంటుంది. దీనితో పాటు కొత్త LED ఫాగ్ ల్యాంప్‌లు కలిగిన బంపర్ ఉంటుంది. 17- ఇంచ్ అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌లో కనిపిస్తాయి. వెనుక బంపర్ మాట్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉంది. సిమ్లా గ్రీన్, బ్రిలియంట్ సిల్వర్, కాండీ వైట్, కార్బన్ స్టీల్, చెర్రీ రెడ్, డీప్ బ్లాక్, లావా బ్లూ, స్టీల్ గ్రే కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. ఈ బ్రాండ్ మోంటో కార్లో వెర్షన్ స్పోర్టీ లుక్‌ను అందిస్తుంది.
ఇంటీరియర్, ఫీచర్స్:
క్యాబిన్ లో గ్రే-బేజీ కలయితతో డ్యుయల్ టోన్ ఇంటీరియర్ కలిగి ఉంటుంది. పనోరామిక్ సన్‌రూఫ్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా రియల్ సీట్ మసాజ్ ఫంక్షన్ ఉంది. 6-వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్, వెంటిలేడెట్ సీట్లు, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ బేస్డ్ ఏఐ కంపానియన్ వాయిస్ కమాండ్స్ కలిగి ఉంటుంది. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ SUV డిస్క్ బ్రేక్‌లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ డిస్క్ వైపింగ్, TPMS, హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్, రియర్ డీఫాగర్ కలిగి ఉంటుంది.
స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్ 1.0-లీటర్ TSI ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 104 hp పవర్ మరియు 250 Nm పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల TSI ఇంజిన్ ఆఫ్షన్ కూడా ఉంది. ఇది 147 hp పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే ఈ సెగ్మెంట్‌లో 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ఆటోమేటిక్ (1.0 TSIకి మాత్రమే), 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ ఆఫ్షన్లు ఉన్నాయి.