NTV Telugu Site icon

Tata Cars: గుడ్‌న్యూస్.. ఈ టాటా ఎలక్ట్రిక్ కారుపై రూ.1.20 లక్షల తగ్గింపు!

Tata Punch Ev

Tata Punch Ev

ఎలక్ట్రిక్ కార్లపై (EV) బంపర్ డిస్కౌంట్ల సీజన్ కొనసాగుతోంది. వాస్తవానికి.. డీలర్‌షిప్ మిగిలిన స్టాక్‌ను విక్రయించేందుకు భారీ తగ్గింపులను ప్రవేశపెట్టాయి. 2024 సంవత్సరం ప్రారంభంలో విడుదలైన టాటా పంచ్ ఈవీపై గరిష్టంగా రూ. 1.20 లక్షల వరకు తగ్గింపును ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఎలక్ట్రిక్ కార్లతో పాటు, ద్విచక్ర వాహనాలపై కూడా స్టాక్ క్లియరెన్స్ విక్రయాలు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం, కస్టమర్‌లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. ప్రస్తుతం టాటా పంచ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల వరకు ఉంది. పంచ్ ఈవీ ఫీచర్లు, తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: HMPV Virus: చైనాలో విస్తరిస్తున్న వైరస్ కారణంగా మనం దేనికి భయపడాలి.. లాక్‌డౌన్‌ తప్పదా..?

టాటా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ ప్యూర్‌ ఈవీ ఆర్కిటెక్చర్‌పై పంచ్‌ ఈవీ రూపొందింది. ఈ కారు స్టాండర్డ్‌, లాంగ్‌ రేంజ్‌ వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్‌ వేరియంట్‌లో 25kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 315 కిలోమీటర్లు (MIDC) రేంజ్‌ ఇస్తుంది. లాంగ్ రేంజ్‌ మోడల్‌లో 35 kWh బ్యాటరీ ప్యాక్‌ ఇస్తున్నారు. ఇది సింగిల్‌ ఛార్జ్‌పై 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మోటార్‌, బ్యాటరీ ప్యాక్‌ ఐపీ67 రేటింగ్‌తో వస్తున్నాయి. ఎనిమిదేళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల (ఏది ముందైతే అది) వారెంటీతో వస్తోంది.

READ MORE: Sheikh Mallika: వికటించిన వశీకరణం.. ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో..!

టాటా స్టాండర్డ్‌ వేరియంట్‌ను 3.3kW ఏసీ హోమ్‌ వాల్‌ బాక్స్‌తో అయితే 9.4 గంటలు ఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. అదే 7.2kW ఏసీ హోమ్ వాల్‌ బాక్స్‌ ఛార్జర్‌తో అయితే 3.6 గంటలు, 15ఏ ప్లగ్‌తో అయితే 9.4 గంటలు ఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. 50kW డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో కేవలం 56 నిమిషాల్లోనే 10-80 శాతం ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ పేర్కొంది. లాంగ్‌ రేంజ్‌ వేరియంట్‌ను 3.3 kW ఏసీ హోమ్‌ ఛార్జర్‌ బాక్స్‌ లేదా 15ఏ ప్లగ్‌పాయింట్‌తో ఛార్జ్‌ చేయాల్సి వస్తే 10-100 శాతం ఛార్జ్‌ అవ్వడానికి 13.5 గంటల సమయం పడుతుంది. 7.2kW ఏసీ హోమ్‌ వాల్‌బాక్స్‌ ఛార్జర్‌తో అయితే 5 గంటలు, 50kW డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో అయితే కేవలం 56 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్‌ చేయొచ్చని టాటా మోటార్స్‌ పేర్కొంది.

గమనిక: మేము వివిధ ప్లాట్‌ఫారమ్‌లు, కొన్ని వార్తా సంస్థల సమాచారం మేరకు కార్లపై అందుబాటులో ఉన్న తగ్గింపులను తెలియజేస్తున్నాం. ఈ తగ్గింపు మీ నగరం లేదా డీలర్‌లో ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు. కారు కొనడానికి ముందు.. తగ్గింపునకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోండి.

Show comments