NTV Telugu Site icon

Royal Enfield Shotgun 650 : రాయల్ ఎన్‌ఫీల్డ్ న్యూ బైక్‌.. భారత్‌లో 25 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు..

Re Bike

Re Bike

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే ఈ కంపెనీ బండ్లనుకొనాలని ఆశ పడతారు.. కాగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల షాట్‌గన్ 650కి చెందిన ప్రత్యేక ఐకాన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనిని అమెరికాకు చెందిన కస్టమ్ మోటార్‌సైకిల్ తయారీదారు ఐకాన్ మోటోస్పోర్ట్స్ సహకారంతో తయారు చేయనుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ బైక్‌ను ప్రపంచవ్యాప్తంగా 100 యూనిట్లు మాత్రమే తయారు చేసి అమ్ముతుంది. భారతదేశంలో 25 మంది కొనుగోలు చేసేందుకు కంపెనీ అవకాశం కల్పించింది. అంటే మన దేశంలో కేవలం 25 మందికి మాత్రమే ఈ ద్విచక్ర వాహనాన్ని విక్రయిస్తారు. ప్రస్తుతం కేటాయించిన అన్ని యూనిట్లు అమ్ము డయ్యాయి. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.25 లక్షలు. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే దాదాపు రూ. 65,000 ఎక్కువ.

READ MORE: Minister Atchannaidu: టీడీపీ ఆఫీస్‌పై దాడిని అందరూ చూశారు.. వంశీ అరెస్ట్‌లో రహస్యం ఏమీలేదు..

ఇప్పుడు కేటాయించి 25 బైక్స్ బుక్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో 648cc ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను అమ్చారు. ఇది 47bhp శక్తి, 52.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని బరువు 240 కిలోలు.ఈషాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ మంచి పని తీరును కనబరుస్తుందని కంపెనీ తెలిపింది. నగరంలో ప్రయాణించేవారికి లాంగ్ హైవే టూరింగ్ రెండింటికీ అద్భుతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దాని స్టైలిష్ పెయింట్ 3 కలర్ ఆప్షన్లతో ఉంటుంది. తెలుపు, నీలం, ఎరుపు రంగుల కలయికలో ఉంటుంది. ఇదే బైక్‌లో ప్రత్యేకం. బ్లూ షాక్ అబ్జార్బర్ స్ప్రింగ్స్, గోల్డెన్ వీల్స్, రెడ్ సీట్లు, రెట్రో స్టైల్ గ్రాఫిక్స్ వంటి ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్స్ దీన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. దీన్ని కొనుగోలు చేసిన వారికి కంపెనీ ప్రత్యేక జాకెట్ అందిస్తుంది. ఈ ఎడిషన్ కోసం ఈ జాకట్‌ను ప్రత్యేకంగా తయారు చేశారట.

READ MORE: MLC Kavitha: జనగామ జిల్లా ఏర్పడింది కేసీఆర్ కృషితోనే.. బీసీ బిల్లుల కోసం ఉద్యమం చేయాలి!