Renault Kiger Facelift: రెనాల్ట్ భారత మార్కెట్‌లో తన కాంపాక్ట్ SUV కైగర్ (Kiger) ఫేస్‌లిఫ్ట్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ మధ్యనే ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ను పరిచయం చేసిన వెంటనే.. కైగర్‌ను కూడా కొత్త డిజైన్, ఫీచర్లు, కేబిన్ మార్పులతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ కారు ప్రారంభ ధర రూ.6.29 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించగా, టాప్ వేరియంట్ అయిన టర్బో వేరియంట్ రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి లభిస్తోంది.
ఈ కొత్త కైగర్ ఫేస్‌లిఫ్ట్‌లో ముందుభాగం డిజైన్ సరికొత్తగా మారింది. సన్నని గ్రిల్ పక్కన స్లీక్ DRLs, మధ్యలో కొత్త రీనాల్ట్ లోగో, కొత్తగా డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్ హౌసింగ్, ఫాగ్ ల్యాంప్ లతో ఉన్న బంపర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక సైడ్ లుక్స్ లో పెద్ద మార్పులు లేకపోయినా.. 16 అంగుళాల అలాయ్ వీల్స్ కొత్త డిజైన్‌లో వచ్చాయి. వీటితోపాటు కొత్త గ్రీన్ పెయింట్ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.
8200mAh భారీ బ్యాటరీ, IP69+ సర్టిఫికేషన్ తో విడుదలకు సిద్దమైన Vivo Y500
ఇంటీరియర్‌లో ఎక్కువగా పాత లేఅవుట్ కొనసాగినప్పటికీ, డ్యాష్ బోర్డ్ పై బ్లాక్-లైట్ గ్రే కలర్ కలియికతో డ్యూయల్ టోన్ ఫినిష్ అందించబడింది. ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ముఖ్యమైన అప్‌డేట్స్ అని చెప్పవచ్చు. ఇక ఫీచర్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, ఆటో లైట్స్ అండ్ వైపర్స్, వైర్‌లెస్ చార్జర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
ఇక భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, టైర్ ప్రెషర్ మానిటర్, హిల్ స్టార్ట్ అసిస్టు వంటి ఫీచర్లు అందించబడ్డాయి. ఈ కారు అంతేంటిక్, ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్ అనే నాలుగు వేరియంట్లలో లభ్యమవుతాయి. ఇక ఇంజిన్, కారు పనితీరు విషయానికి వస్తే.. రీనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్‌లో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఒకటి 1.0-లీటర్ నేచురల్లి ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 72hp కాగా.. మరొకటి 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100hp.
Delhi Metro Fare Hike: పెరిగిన మెట్రో ఛార్జీలు.. 8 సంవత్సరాల తర్వాత..!
ఇక వీటిలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా లభించగా, నేచురల్లి ఆస్పిరేటెడ్ ఇంజిన్‌కు AMT ఆప్షన్ కూడా ఉంది. టర్బో ఇంజిన్ వేరియంట్‌ను CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయవచ్చు. కంపెనీ ప్రకారం, కైగర్ తన సెగ్మెంట్‌లోనే ఉత్తమమైన 0-100 kmph యాక్సిలరేషన్ టైమ్ అందిస్తుంది. రీనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ ధరలు వేరియంట్ ఆధారంగా విభజించబడ్డాయి. ఇందులో ఆథెంటిక్ (Authentic) వేరియంట్ లో 1.0 NA-MT మోడల్ ధర రూ.6.29 లక్షలుగా నిర్ణయించబడింది. ఎవల్యూషన్ (Evolution) వేరియంట్ 1.0 NA-MT ఆప్షన్‌లో రూ.7.09 లక్షలు. కాగా టెక్నో (Techno) వేరియంట్ ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి, ఇందులో 1.0 NA-MT మోడల్ రూ.8.19 లక్షలు, అలాగే 1.0 Turbo-CVT ఆప్షన్ రూ.9.99 లక్షలు. ఇక టాప్ ఎండ్ ఎమోషన్ (Emotion) వేరియంట్లో 1.0 NA-MT ధర రూ.9.14 లక్షలు, 1.0 Turbo-MT ఆప్షన్ రూ.9.99 లక్షలు కాగా, 1.0 Turbo-CVT ఆప్షన్ రూ.11.26 లక్షలుగా కంపెనీ పేర్కొంది.
