ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!
- Ola Electric నుంచి కొత్త S1 X+ 5.2 kWh స్కూటర్ లాంచ్
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ వరకు రేంజ్ (IDC)
- 4680 భారత్ సెల్ టెక్నాలజీతో అధునాతన బ్యాటరీ సామర్థ్యం
- 11 kW మిడ్-డ్రైవ్ మోటార్, ఇంటిగ్రేటెడ్ MCU సపోర్ట్
- గరిష్ట వేగం 125 కి.మీ./గం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ola S1 X+ Launched: ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కొత్తగా S1 X+ 5.2 kWh అనే కొత్త స్కూటర్ వేరియంట్‌ను భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త స్కూటర్ లో కంపెనీ స్వదేశీగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీని వినియోగించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీ ద్వారా అధునాతన బ్యాటరీ సామర్థ్యాన్ని సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యంగా పెట్టుకుంది.
430 సీసీ కెమెరాలు, 2000 పోలీసుల గస్తీ మధ్య ఉప్పల్ వేదికగా SRH vs RR మ్యాచ్..!
Also Read
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
Ola S1 X+ 5.2 kWh స్కూటర్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల (IDC) వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఇందులో 11 kW మిడ్-డ్రైవ్ మోటార్, ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్ యూనిట్ (MCU) ఉన్నాయి. ఈ స్కూటర్ గరిష్టంగా 125 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ స్కూటర్‌లో బ్రేక్-బై-వైర్ టెక్నాలజీతో పాటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇవి రోజువారీ వినియోగంలో మెరుగైన కంట్రోల్, భద్రతను అందిస్తాయి.
ఈ లాంచ్ ద్వారా ప్రీమియం మోడల్స్‌లో మాత్రమే ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ఇప్పుడు మాస్ సెగ్మెంట్‌లోకి తీసుకురావడమే కంపెనీ లక్ష్యంగా ఉంది. రేంజ్ సమస్య (range anxiety), ధర వంటి అంశాలు EVల వినియోగానికి ప్రధాన అడ్డంకులు కాగా, ఈ కొత్త మోడల్ వాటిని అధిగమించేలా రూపొందించబడింది. సెల్ డెవలప్‌మెంట్ నుంచి వాహన తయారీ వరకు అన్నింటినీ స్వయంగా నిర్వహించడం ద్వారా ఖర్చులను తగ్గిస్తూ, కొత్త టెక్నాలజీలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. దీనినే ‘వర్టికల్ ఇంటిగ్రేషన్’గా పిలుస్తారు.
Trisha: నటి త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు
ఇప్పటికే Ola వద్ద S1 Pro+, S1 Pro వంటి ప్రీమియం స్కూటర్లతో పాటు, S1 X సిరీస్‌లో పలు వేరియంట్లు ఉన్నాయి. అంతేకాకుండా రోడ్ స్టర్ (Roadster) సిరీస్ ద్వారా మోటార్‌సైకిల్ సెగ్మెంట్ లో కూడా ప్రవేశించింది. S1 X+ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,29,999గా నిర్ణయించగా, ఈ ఆఫర్ ధర ఏప్రిల్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!