Trisha: నటి త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు
- తమిళనాడు ఎన్నికల వేళ నటి త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు
- డాగ్, బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు
- బూటకపు బెదిరింపుగా తేల్చిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రముఖ హీరోయిన్ త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు వచ్చింది. టైనంపేట్‌లోని త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లుగా డీజీపీ కార్యాలయానికి ఈ మెయిల్ బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే టైనంపేట్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా త్రిష ఇంట్లో పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ సోదాలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్ బృందం జాగిలాలతో తనిఖీలు చేయగా.. త్రిష ఇంట్లో ఎలాంటి బాంబు ఆనవాళ్లు కనిపించలేదని తేల్చారు. బాంబు బెదిరింపు బూటకమని ప్రకటించారు.

Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
ఈ మెయిల్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి బాంబ్ బెదిరింపులకు దిగినట్లుగా తెలుస్తోంది. అయితే దుండగుడు ఎవరనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమెయిల్‌లో లభించిన ఐడీ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులు కూపీ లాగుతున్నారు. నిందితుడు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం త్రిష-హీరో విజయ్ కలిసి ఉంటున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల ఒకే కారులో పెళ్లికి కూడా హాజరయ్యారు. దీంతో వదంతులకు బలం చేకూరింది. ఇక ప్రస్తుతం విజయ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. విజయ్ కొత్తగా టీవీకే పార్టీని స్థాపించారు. అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా పని చేస్తున్నారు. ఏ మేరకు తమిళనాడు ప్రజలు ఆదరిస్తారు? అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Pope Leo-Trump: ట్రంప్ అంటే భయం లేదు.. యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా.. పోప్ లియో ప్రకటన
తాజావార్తలు
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!