Cars Launches in December: డిసెంబర్ 2025 భారత ఆటో మొబైల్ మార్కెట్‌కి కీలకమైన నెలగా మారబోతోంది. నాలుగు ప్రముఖ బ్రాండ్లు మారుతీ సుజుకి, టాటా మోటార్స్, కియా, మినీ కూపర్ అనే తమ కొత్త కార్లను ఈ నెలలో లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి. అందులో మొదటగా మారుతీ సుజుకి e-విటారా, తర్వాత కొత్త తరం కియా సెల్టోస్ వంటివి లాంచ్ కానున్నాయి. మరి డిసెంబర్ నెలలో విడుదల కాబోయే అన్ని మోడళ్ల వివరాలు చూసేద్దామా..
మారుతీ సుజుకి e-విటారా:
డిసెంబర్ 2, 2025న మారుతీ సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారైన e-విటారాను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ EVను గుజరాత్‌లోని హన్సల్పూర్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ SUVలో 49 kWh, 61 kWh రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇవి గరిష్టంగా 500 కి.మీ. రేంజ్ అందిస్తాయి. అలాగే ఇందులో లెవల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, TPMS, LED లైట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉంటాయి.
Rohit-Kohli: 1, 3 స్థానాలు ఇప్పటికే ఫిక్స్.. 2027 వన్డే వరల్డ్‌కప్‌లో రో-కో!
కొత్త తరం కియా సెల్టోస్:
కియా తన పాపులర్ కంపాక్ట్ SUV సెల్టోస్ కొత్త తరం మోడల్ ను డిసెంబర్ 10న భారత్‌లో విడుదల చేయబోతోంది. గ్లోబల్ డిజైన్ థీమ్ ఆధారంగా రూపొందించిన ఈ కొత్త జనరేషన్ సెల్టోస్, స్క్వేర్ ఫ్రంట్, ఫ్లాట్ బోనెట్, రెక్టాంగ్యులర్ గ్రిల్, స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్స్‌తో మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈసారి కియా రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో పాటు హైబ్రిడ్ టెక్నాలజీను కూడా అందించే అవకాశం ఉంది. ఇంటీరియర్స్‌ను పూర్తిగా రీడిజైన్ చేసి, కొత్త డ్యుయల్ టోన్ అప్హోల్స్టరీ, కొత్త సీట్లతో ప్రీమియం లుక్ ఇవ్వనున్నారు.
BMW మినీ కూపర్ S కన్వర్టిబుల్:
BMWకి చెందిన మినీ కూపర్, తన S కన్వర్టిబుల్ కారును ఈ నెలలో భారత్‌లో లాంచ్ చేయబోతోంది. ఈ మోడల్ కూపర్ S ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఉన్న 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 201 bhp పవర్, 300 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రీమియం కన్వర్టిబుల్ కారుకు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీని ధర సుమారు రూ.50 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండే అవకాశం ఉంది.
పిల్లల కోసం సరికొత్త Hero Vida Dirt.E K3.. డిసెంబర్ 12న లాంచ్.. ఫీచర్లు ఇవే!
టాటా హారియర్ & సఫారి:
టాటా మోటార్స్ ప్రీమియం SUVలు అయిన హారియర్ అండ్ సఫారిలు తొలిసారిగా కొత్త పెట్రోల్ ఇంజిన్‌లతో మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఇవి డిసెంబర్ 9, 2025న విడుదల కానున్నాయి. ఈ ఇంజిన్‌లు టాటా ‘హైపీరియన్’ ప్రోగ్రామ్‌లో అభివృద్ధి చేయబడ్డాయి. ఇందులో కొత్త ఇంజిన్ ఆప్షన్లు ఇలా ఉన్నాయి. ఇందులో ఒకటి 1.5 లీటర్ 4-సిలిండర్ NA పెట్రోల్ 105 bhp పవర్, 145 Nm టార్క్ కాగా.. మరొకటి 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ 158 bhp పవర్, 255 Nm టార్క్ మోడల్ ఒకటి. ఇవి 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉంటాయి.
