MINI Cooper Convertible Stardust Edition: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
- మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల
- ఎక్స్-షోరూమ్ ధర రూ.62.90 లక్షలు
- ఈ కారు ప్రత్యేకతల్లో కన్వర్టిబుల్ రూఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత లగ్జరీ కార్ల మార్కెట్లో మరో కొత్త మోడల్ అందుబాటులోకి వచ్చింది. మినీ సంస్థ తన కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రత్యేకమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, అధునాతన ఫీచర్లతో ఈ కారు కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్‌ను స్పార్క్లింగ్ కాపర్ గ్రే రంగులో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణ కూపర్ కన్వర్టిబుల్తో పోలిస్తే ప్రత్యేకమైన డిజైన్, అదనపు ఫీచర్లతో ఈ ఎడిషన్‌ను రూపొందించారు.
2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్
ఈ లగ్జరీ కన్వర్టిబుల్‌లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 204 హార్స్పవర్, 300 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు. శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు కన్వర్టిబుల్ డిజైన్ ఈ కారుకు స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతిని అందించేలా ఉంటుంది.
Also Read
- Ather Pothole+ Alerts: ఏథర్ స్కూటర్లకు కీలక అప్డేట్.. గుంతలు, స్పీడ్ బంప్లపై ముందే అలర్ట్! ఎలా పనిచేస్తుందంటే?
- Avor Electric Bike: అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. 260KM రేంజ్, 114Kmph టాప్ స్పీడ్! ధర, ఫీచర్లు ఇవే!
- Kawasaki Ninja 250: కవాసకి నింజా 250 విడుదల.. మిలమిల మెరిసే కొత్త కలర్స్, పవర్ఫుల్ ఇంజన్.. ధర ఎంతంటే?
- Piaggio Sales: పియాజియో దూకుడు.. 49% అమ్మకాల వృద్ధితో కొత్త రికార్డు, వెస్పా స్కూటర్ల హవా!
ఫీచర్లు అదుర్స్
మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్‌లో అనేక ప్రీమియం ఫీచర్లను అందించారు. ఇందులో LED హెడ్లైట్లు, LED DRLs, Head-Up Display, మెమరీ ఫంక్షన్‌తో కూడిన సీట్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, 9.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, Harman Kardon ఆడియో సిస్టమ్, డిజిటల్ కీ, రిమోట్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
18 సెకన్లలో పైకప్పు ఓపెన్
ఈ కారు ప్రత్యేకతల్లో కన్వర్టిబుల్ రూఫ్ కూడా ఒకటి. గంటకు 30 మైళ్ల వేగం వరకు ప్రయాణిస్తున్న సమయంలో రూఫ్‌ను కేవలం 18 సెకన్లలో పూర్తిగా ఓపెన్ చేయవచ్చు. అదే విధంగా రూఫ్‌ను 15 సెకన్లలో క్లోజ్ చేయవచ్చు.
ధర ఎంత?
భారతదేశంలో మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.62.90 లక్షలుగా నిర్ణయించారు. సాధారణ మినీ కూపర్ కన్వర్టిబుల్తో పోలిస్తే ఈ ప్రత్యేక ఎడిషన్ ధర సుమారు రూ.3.9 లక్షలు అధికం. ఈ కారును భారతదేశంలో CBU (Completely Built-Up) యూనిట్‌గా మాత్రమే విక్రయించనున్నారు. అంటే విదేశాల్లో పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేసి విక్రయిస్తారు.
మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ కోసం బుకింగ్స్‌ను మినీ అధికారిక వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు. ప్రత్యేకమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన 2.0 లీటర్ ఇంజిన్, కన్వర్టిబుల్ రూఫ్‌తో ఈ కొత్త ఎడిషన్ భారత లగ్జరీ కార్ల విభాగంలో ప్రత్యేకమైన ఎంపికగా నిలవనుంది.
తాజావార్తలు
-
MINI Cooper Convertible Stardust Edition: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
-
Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
-
Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న ‘శ్రీనివాస మంగపురం’
-
West Bengal Cash Haul: ఎక్స్- బస్ డ్రైవర్ ఇంట్లో రూ. 28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం..
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?