MG showcases new electric and hybrid models at Auto Expo 2023: ప్రముఖ కార్ మేకర్ మోరిస్ గారేజ్(ఎంజీ) మోటార్స్ త్వరలో ఇండియాలో మూడు ఎలక్ట్రిక్ కార్ మోడళ్లను తీసుకురాబోతోంది. ఇప్పటికే ఎంజీ జెడ్ ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ఇండియా వ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. రాబోయే ఐదేళ్లలో ప్రతీ ఏడాది కొత్త ఎలక్ట్రిక్ కార్ ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఎంజీ మోటార్ ఆటో ఎక్స్ పో 2023లో కొత్తగా మూడు ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించింది. ఎంజీ4 ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ తో పాటు eHS హైబ్రీడ్ ఎస్ యూవీని, మిఫా 9 ఎలక్ట్రిక్ ఎంయూవీని ప్రదర్శించింది.
ఎంజీ 4 ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ రెండు బ్యాటరీ ప్యాకులతో అందుబాటులోకి రానుంది. 51kWh, 64kWh బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉంటుంది. 51kWh వచ్చే వేరియంట్ లో 170 bhp సామర్థ్యం కలిగిన మోటార్ ఉంటుంది, 64kWh వేరియంట్ లో 203 bhp సామర్థ్యం కలిగిన మోటార్ ఉంటుంది. ఎంజీ4 రెండు డిస్ ప్లేలతో, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, ADAS ఫీచర్లతో వస్తుంది.
Read Also: Tollywood: వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్
ఇక ఎంజీ eHS ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో వస్తుంది. బ్యాటరీ మోటార్, పెట్రోల్ ఇంజన్ కలిగిన ఈ హైబ్రీడ్ కారు 258bhp శక్తితో కేవలం 6.9 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. పెట్రోల్ ఇంజిన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 161 bhp పవర్ ను ఉత్పత్తి చేయగా, ఎలక్ట్రిక్ మోటార్ 120bhp శక్తిని ఇస్తుంది. 16.6 kWh వస్తున్న ఈ కార్ బ్యాటరీ సామర్థ్యంతో 51 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది.
ఎంజీ మిఫా 9 ఎంపీవీ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ కారుగా వస్తోంది. కియా కార్నివాల్ తో పోలిస్తే పెద్దది ఉంది. 250 bhp సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ 350 న్యూటన్ మీటర్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. 90kWh బ్యాటరీ ప్యాక్ తోె వచ్చే ఈ కార్ 440 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది.