Maruti Suzuki Sales 2025: మారుతీనా మజాకా!.. నిమిషానికి 4 కార్లు అమ్మింది గురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Suzuki Sales 2025: మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ అమ్మకాల్లో మరోసారి సంచలన సృష్టించింది. 2025 క్యాలెండర్ సంవత్సరంలో రికార్డు స్థాయి ఉత్పత్తిని నమోదు చేసింది. మారుతి సుజుకి CY 2025లో 22.55 లక్షల యూనిట్లు విక్రయించి మరోసారి రికార్డు నెలకొల్పింది. అంటే నిమిషానికి 4 కార్లు అమ్మింది. ఈ ఏడాది వివరాలను వెల్లడిస్తూ కంపెనీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది గత సంవత్సరం (2024)తో పోలిస్తే 9.3 శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ పేర్కొంది. వరుసగా రెండో ఏడాది కూడా 20 లక్షలకు పైగా వాహనాల ఉత్పత్తిని దాటడం గమనార్హం. కంపెనీ ప్రకారం.. ఈ ఉత్పత్తిలో దేశీయ విక్రయాలు, ఎగుమతులు, అలాగే OEM (ఇతర కంపెనీల కోసం తయారీ) సరఫరాలు కూడా ఉన్నాయి. 2024లో మారుతీ సుజుకి 20.63 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది.
READ MORE: Rajnath Singh: ‘‘వైట్ కాలర్ టెర్రరిజం’’పై రక్షణ మంత్రి ఆందోళన..
Also Read
- 32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
- Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
- రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ఈ సందర్భంగా మారుతీ సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ హిసాషి టకేఉచి మాట్లాడారు. ఉద్యోగుల కృషి, సరఫరాదారుల భాగస్వాములతో ఉన్న బలమైన సమన్వయమే ఈ రికార్డు ఉత్పత్తికి కారణమని తెలిపారు. అధిక స్థాయి లోకలైజేషన్ వల్లే ప్రపంచ స్థాయి నాణ్యతను కాపాడుతూ ఇంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. ఇది భారత ఆటోమొబైల్ తయారీ వ్యవస్థ బలాన్ని, అంతర్జాతీయ పోటీతత్వాన్ని చాటుతోందన్నారు. కాగా.. 2025లో మారుతీ సుజుకి అత్యధికంగా ఉత్పత్తి చేసిన టాప్ ఐదు మోడళ్లుగా ఫ్రాంక్స్ (Fronx), బాలెనో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా నిలిచాయి.
READ MORE:Pooja Hegde: సక్సెస్ టేస్ట్ మర్చిపోయిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మను ఆదుకోవాల్సింది ఆ హీరోయేనా?
తాజావార్తలు
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!