Site icon NTV Telugu

Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి ఈ-విటారా లాంచ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..

Maruti Suzuki E Vitara

Maruti Suzuki E Vitara

Maruti Suzuki e Vitara: ఎలక్ట్రిక్ కార్‌ల వినియోగం భారతదేశంలో పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఫ్లాగ్‌షిప్ కార్లను మార్కెట్‌లోకి దించుతున్నాయి. తాజాగా, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన మొదటి ఎలక్ట్రిక్ వాహహం, ఈ-విటారాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025లో మొదటిసారిగా ఈ కారును ప్రదర్శించారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా BE 6, MG ZS EVలకు మారుతి సుజుకి ఈ-విటారా పోటీ ఇవ్వబోతోంది.

Read Also: Liquor Scam Case: క్లైమాక్స్‌కి చేరిన లిక్కర్ స్కాం కేసు.. విచారణలో కీలక విషయాలు..

డిజైన్, ఫీచర్లు:

డిజైన్, ఫీచర్లను గమనిస్తే హెడ్‌లైట్‌లో త్రి-పాయింట్ మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ ఇంటిగ్రేట్ చేశారు. దీనికి తోడు హెడ్‌లైట్ మధ్యలో సియానో బ్లాక్ యాక్సెంట్‌లను లుక్‌ కోసం పెట్టారు. కారు వెనక విడ్ షీల్డ్‌పై నెక్సా బ్రాండింగ్ ఉంటుంది.  18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

ఇంటీరియర్స్ పరిశీలిస్తే, బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్స్‌లో డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 10.25-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్‌ను ఉంటుంది. బ్రాండ్ లెథరేట్ సీటింగ్, ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్ ఉంటాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10 వేస్ అడ్జెస్టెడ్ డ్రైవర్ సీట్, స్లైడింగ్, రిక్లైనింగ్ వెనక సీట్లు, 7 ఎయిర్ బ్యాగులు, లెవల్ -2 ADAS, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కీలెస్ ఎంట్రీ, రైడ్-బై-వైర్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి.

Read Also: S*ex Scandal: థాయ్‌లాండ్‌ని కుదిపేస్తున్న బౌద్ధ సన్యాసుల సె*క్స్ కుంభకోణం..

బ్యాటరీ, రేంజ్ వివరాలు:

మారుతు సుజుకి ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తోంది. 49 kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌తో 346 కి.మీ రేంజ్ ఇస్తుంది. 61 kWh బ్యాటరీ 428 కి.మీ పరిధిని కలిగి ఉంటుంది. 49 kWh బ్యాటరీ కేవలం సింగిల్ మోటార్ ఉంటే, 61 kWh బ్యాటరీ సింగిల్ మోటార్, డ్యుయల్ మోటార్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. డ్యుయల్ మోటార్ ఆప్షన్ 412 కి.మీ రేంజ్ ఇస్తుంది.

పవర్ పరంగా, సింగిల్-మోటార్ 49 kWh మోడల్ 142 bhpని పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే 61 kWh వేరియంట్ 172 bhp అధిక అవుట్‌పుట్‌ను అందిస్తుంది. రెండు వెర్షన్లు 192.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనికి విరుద్ధంగా, డ్యూయల్ మోటార్లతో కూడిన ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్, 178 bhp పవర్‌ను, 300 Nm టార్క్‌ను అందిస్తుంది.

Exit mobile version