NTV Telugu Site icon

Maruti Suzuki Celerio: రూ. 5.64 లక్షలకే బుజ్జి కారు.. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు

Maruti Suzuki Celerio

Maruti Suzuki Celerio

మారుతి సుజుకి ఇండియా కొత్త మోడల్ సెలెరియోను విడుదల చేసింది. ఇందులో భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అమర్చింది. అంతేకాదు లేటెస్ట్​ అప్డేట్‌తో కంపెనీ ఈ కారు ధరను కూడా పెంచింది. ప్రస్తుతం ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.64 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్​ వేరియంట్​ ధర రూ .7.37 లక్షలుగా కంపెనీ ప్రకటించింది.

REDA MORE: Harish Rao: కొనాయిపల్లి వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంలో హరీష్ ప్రత్యేక పూజలు..

సెలెరియో ఎంట్రీ లెవల్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ .27,500, వీఎక్స్ఐ ఎంటీ, వీఎక్స్ఐ సీఎన్జీ ఎంటి వేరియంట్ల ధర రూ .16,000, వీఎక్స్ఐ ఏఎమ్​టీ ధర రూ .21,000 పెరిగి నట్లు కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా జెడ్ఎక్స్ఐ ఎంటీ, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఎంటీ వేరియంట్ల ధరలు కూడా రూ.27,500 పెరిగాయి. జెడ్ఎక్స్ఐ + ఏఎమ్​టీ రూ .32,500 పెరిగింది.

REDA MORE:YV Subba Reddy: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించింది..

మారుతీ సుజుకీ సెలెరియో టాప్ వేరియంట్లలో స్మార్ట్​ఫోన్ నావిగేషన్​తో కూడిన 7 ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టెమ్ అందుబాటులో ఉంది. యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని కూడా సపోర్టు చేస్తుంది. ఇందులో కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ వంటి ఫీచర్లు అమర్చారు. ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్​పీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఏఎంటీ వేరియంట్లలో ఉన్నాయి.

REDA MORE: YV Subba Reddy: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించింది..

సెలెరియోలో K10C డ్యూయల్‌జెట్ 1.0-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 66 hp శక్తిని, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. దాని LXI వేరియంట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో లేదు. దీని మైలేజ్ లీటర్‌కు 26.68 కి.మీ అని కంపెనీ తెలిపింది. సీఎన్‌జీ వేరియంట్‌ ఒక కిలో CNG కి 35.60 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.